Share News

గూగుల్‌, ఫేస్‌బుక్‌లకు ఊరట

ABN , Publish Date - Mar 26 , 2025 | 03:56 AM

వాణిజ్య చర్చల్లో అమెరికాను మెప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో చర్య తీసుకుంది. గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి ఆన్‌లైన్‌ డిజిటల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చే ప్రకటనలపై ...

గూగుల్‌, ఫేస్‌బుక్‌లకు ఊరట

డిజిటల్‌ ప్రకటనలపై పన్ను పోటు రద్దు

న్యూఢిల్లీ: వాణిజ్య చర్చల్లో అమెరికాను మెప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో చర్య తీసుకుంది. గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి ఆన్‌లైన్‌ డిజిటల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చే ప్రకటనలపై ఈక్వలైజేషన్‌ లెవీ పేరుతో విధించే 6 శాతం పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. గూగుల్‌ ట్యాక్స్‌గా పేరొందిన ఈ పన్నును ఏప్రిల్‌ 1 నుంచి రద్దు చేస్తున్నట్టు తెలిపింది. దీనికి సంబంధించి ఆర్థిక బిల్లు, 2025కు చేసిన సవరణకు పార్లమెంట్‌ కూడా ఆమోద ముద్ర వేసింది. దీంతో అమెరికా-భారత్‌ మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు సానుకూలంగా ముగిసే అవకాశాలు మరింత మెరుగయ్యాయని భావిస్తున్నారు. ఈ డిజిటల్‌ మీడియా ప్లాట్‌ఫారాల్లో దేశీయ కంపెనీలు ఇచ్చే ప్రకటనలపై 2016లో ప్రభుత్వం ఈ పన్ను విధించింది. దీనిపై అమెరికా గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పన్నును వెనక్కి తీసుకోకపోతే భారత్‌ నుంచి దిగుమతయ్యే రొయ్యలు, బాస్మతి బియ్యంపై తామూ అదే స్థాయిలో పన్ను విధిస్తామని హెచ్చరించింది. తాజా చర్యతో ఈ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌పై ప్రకటనల ఖర్చు తగ్గడంతో పాటు వాటి లాభాలూ పెరుగుతాయని భావిస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ ఈవై సీనియర్‌ సలహాదారు సుదీర్‌ కపాడియా ప్రభుత్వ చర్యను తెలివైన చర్యగా అభివర్ణించారు. అమెరికాతో తలెత్తిన వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఈ చర్య ఉపకరిస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి:

Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..

Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 26 , 2025 | 03:56 AM