సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:26 PM
కాంగ్రెస్ ప్రభు త్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజ ల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే యె న్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్‌నగర్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ ప్రభు త్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజ ల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే యె న్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శు క్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జైబాపు, జైభీమ్ జై సంవిధాన్ కార్యక్రమంపై మహబూబ్‌నగర్ మండల ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. కా ర్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, ఆనంద్‌కుమార్‌గౌడ్, సిరాజ్‌ఖాద్రి, బెనహర్, బెక్కరి మధుసూదన్‌రెడ్డి, అజ్మత్‌అలీ, ఏర్పుల నాగరాజు, గోవింద్‌యాదవ్ పాల్గొన్నారు.
ప్రభుత్వం కట్టుబడి ఉంది
దేవరకద్ర: జైబాపు, జైబీమ్, జైసంవిధాన్ ఆశయాలకు తగ్గటుగానే ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాయి బాబా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అం జిల్‌రెడ్డి, కౌకుంట్ల అఽధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కౌకుంట్ల, దేవరకద్ర మం డల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో జైబాపు, జైబీమ్ జైసంవిధాన్ సన్నా హక సమావేశంను ఏర్పాటు చేసి వారు మాట్లాడారు.
జడ్చర్ల: ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ల అంశంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుర్లవెంకటయ్య అన్నారు. పట్టణం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవా రం జైబాపు, జైభీమ్, జైసంవిదాన్ సమీక్ష కార్య క్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో జనార్దన్‌రెడ్డి, నిత్యానందం, మాజీ సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.