Share News

ఫ్రైడే భానుడి భగభగతో రోడ్లు నిర్మానుష్యం

ABN , Publish Date - Mar 28 , 2025 | 11:16 PM

భానుడి ప్రతాపంతో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఎం డ తీవ్రతకు తోడు వడగాల్పులు వీస్తుండటంతో ప్రజ లు ఇబ్బంది పడుతున్నారు.

ఫ్రైడే  భానుడి భగభగతో రోడ్లు నిర్మానుష్యం
ఎండ తీవ్రతకు నిర్మానుష్యంగా మారిన వనపర్తి జిల్లా కేంద్రంలోని రోడ్డు

- మండుతున్న ఎండలు

- 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

- బయటికి రావాలంటే జంకుతున్న ప్రజలు

వనపర్తి అర్బన్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): భానుడి ప్రతాపంతో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఎం డ తీవ్రతకు తోడు వడగాల్పులు వీస్తుండటంతో ప్రజ లు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో గత మూడు రోజు లుగా ఉష్ణోగ్రత 40 డిగ్రీల చేరువలోకి చేరింది. ఎండ వేడిమికి తోడు వడగాల్పులతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. మార్చి చివరి వారంలోనే ఉదయం 10గంటల నుంచి సూర్యుడి ప్రతా పంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. శుక్రవా రం జిల్లాలో 4 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్ర త నమోదైంది. చిన్నంబావి, గోపాల్‌పేట, పెబ్బేరు మండలాల్లో 40.3, ఆత్మకూరు 40.2, పాన్‌గల్‌లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. మరో వారం రోజు ల్లో యాసంగి పంటలు కోతకు రానుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నిర్మాణ కార్మికులు, హమాలీలు ఎండ వేడిమికి తట్టుకోలేకపోతున్నారు. ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలను తీసుకుంటున్నారు.

Updated Date - Mar 28 , 2025 | 11:16 PM