Share News

మార్కెట్లో రికవరీ

ABN , Publish Date - Mar 28 , 2025 | 02:57 AM

ర్యాలీకి ఒక రోజు విరామం ఇచ్చిన అనంతరం ఈక్విటీ సూచీలు తిరిగి రికవరీ బాట పట్టాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, నెలవారీ డెరివేటివ్‌ కాంట్రాక్టుల ముగింపు, బ్లూ చిప్‌ షేర్ల కొనుగోలు...

మార్కెట్లో రికవరీ

సెన్సెక్స్‌ 318 పాయింట్లు అప్‌

ముంబై: ర్యాలీకి ఒక రోజు విరామం ఇచ్చిన అనంతరం ఈక్విటీ సూచీలు తిరిగి రికవరీ బాట పట్టాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, నెలవారీ డెరివేటివ్‌ కాంట్రాక్టుల ముగింపు, బ్లూ చిప్‌ షేర్ల కొనుగోలు నేపథ్యంలో గురువారం సెన్సెక్స్‌ 317.93 పాయింట్ల లాభంతో 77,606.43 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 458.96 పాయింట్లు లాభపడి 77,747.46 పాయింట్లను తాకింది. నిఫ్టీ 105.10 పాయింట్ల లాభంతో 23,591.95 వద్ద ముగిసింది.

ఆటో షేర్లకు ట్రంప్‌ పోటు:

డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌ దెబ్బకు బీఎ్‌సఈలో టాటా మోటార్స్‌ 5.56ు నష్టపోయి రూ.668.60 వద్ద స్థిరపడింది. నష్టపోయిన ఇతర షేర్లలో అశోక్‌ లేలాండ్‌, ఐషర్‌ మోటార్స్‌, మ హీంద్రా, అపోలో టైర్స్‌, సోనా బీఎల్‌డబ్ల్యూ ఉన్నాయి.

Updated Date - Mar 28 , 2025 | 03:16 AM