Share News

భారత్‌లోకి టెస్లా ఎంట్రీ !

ABN , Publish Date - Feb 19 , 2025 | 02:22 AM

అమెరికా విద్యుత్‌ కార్ల (ఈవీ) దిగ్గజం టెస్లా కార్లు త్వరలోనే భారత రహదారులపై పరుగులు తీయనున్నాయి. కంపెనీ త్వరలోనే దేశంలో రెండు షోరూమ్‌లను తెరిచేందుకు సిద్ధమవుతోంది....

భారత్‌లోకి టెస్లా ఎంట్రీ !

  • ఢిల్లీ, ముంబైలో షోరూమ్‌ల ఏర్పాటు

  • నియామకాలూ షురూ

న్యూఢిల్లీ: అమెరికా విద్యుత్‌ కార్ల (ఈవీ) దిగ్గజం టెస్లా కార్లు త్వరలోనే భారత రహదారులపై పరుగులు తీయనున్నాయి. కంపెనీ త్వరలోనే దేశంలో రెండు షోరూమ్‌లను తెరిచేందుకు సిద్ధమవుతోంది. ఢిల్లీ, ముంబైల్లో ఈ షోరూమ్‌లను ప్రారంభించనుంది. ముంబై విమానాశ్రయ సమీపంలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌, ఢిలీ విమానాశ్రయం సమీపంలోని ఏరోసిటీ ప్రాంతాల్లో టెస్లా ఇందుకోసం ఒక్కోటి 5,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే స్థలాన్ని లీజుకు తీసుకుంది. అయితే షోరూమ్‌ల ఏర్పాటు వార్తలపై టెస్లా అదికారికంగా నోరు మెదపడం లేదు. మరోవైపు ఈ రెండు షోరూమ్‌ల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకాల కోసం కంపెనీ తన వెబ్‌సైట్‌లో నియామకాల ప్రకటన కూడా ఇచ్చింది.


ఇవి కూడా చదవండి..

Unemployment Rate: దేశంలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగితపై కీలక నివేదిక..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

TCS Salary Hike: మార్చిలో టీసీఎస్‌లో

మరిన్ని తెలుగు, బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 19 , 2025 | 02:22 AM