యూసీబీలు పటిష్ఠంగా ఉండాలి: మల్హోత్రా
ABN , Publish Date - Mar 20 , 2025 | 03:43 AM
నానాటికీ పెరుగుతున్న ఐటీ, సైబర్ రిస్క్‌ల నేపథ్యంలో దేశంలో పట్టణ సహకార బ్యాంకులు (యూసీబీ) నిర్వహణాపరంగా పటిష్ఠంగా ఉండాలని ఆర్‌బీఐ గవర్నర్...

నానాటికీ పెరుగుతున్న ఐటీ, సైబర్ రిస్క్‌ల నేపథ్యంలో దేశంలో పట్టణ సహకార బ్యాంకులు (యూసీబీ) నిర్వహణాపరంగా పటిష్ఠంగా ఉండాలని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సూచించారు. ఆయన బుధవారం ఎంపిక చేసిన యూసీబీల చైర్మన్లు, ఎండీలు, సీఈఓలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అట్టడుగు స్థాయిలు ప్రజలకు సేవలందిస్తూ ఫైనాన్షియల్ ఇంక్లూజన్‌ను మరింత లోతుగా పాదుకునేలా చేయడంతో యూసీబీల పాత్రను ప్రశంసించారు. డిపాజిటర్లు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేయాలని సూచించారు.