Devotional: భీష్మ ఏకాదశి.. ఆ రోజు ఏం చేస్తే మంచిదంటే..?
ABN , Publish Date - Feb 07 , 2025 | 04:54 PM
Devotional: మాఘ మాసంలో శుక్లపక్ష ఏకాదశిని.. భీష్మ ఏకాదశిగా జరుపుకొంటారు. భీష్మ ఏకాదశి రోజు.. విష్ణు సహస్రనామాలు చదివితే అద్భుతమైన ఫలితం ఉంటుందని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు.

ఏడాదికి 12 మాసాలు.. వాటిలో అత్యంత పవిత్రమైన మాసాల్లో ఒకటి మాఘమాసం. ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడికి ప్రీతికరమైన మాసం ఇది. ఈ మాసంలో చేసే నదీ, సముద్ర స్నానం కానీ.. పూజలకు కానీ ఎంతో ప్రత్యేకత ఉంటుంది. అటువంటి మాఘ మాసంలో శుక్లపక్ష ఏకాదశిని.. భీష్మ ఏకాదశిగా జరుపుకొంటారు. భీష్మ ఏకాదశి రోజు.. విష్ణు సహస్రనామాలు చదివితే అద్భుతమైన ఫలితం ఉంటుందని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. ఈ భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి, అంతర్వేది ఏకాదశి అని కూడా పిలుస్తారని చెబుతున్నారు.
ఈ రోజు ఏం చేస్తే మంచిది..?
ఈ రోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి పండ్లు, తియ్యటి పదార్థాలని నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే గోవులకు పూజ చేసినా విశేష ఫలితాన్ని పొందవచ్చు. ఇక ఈ రోజు.. పసుపు రంగు దుస్తులు ధరించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివినా, విన్నా మోక్షం కలుగుతుందంటారు. ఈ రోజు భీష్ముడికి తర్పణాలు సైతం వదులుతారు. అలా చేయడం వలన స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అంతేకాదు ఈ రోజు భీష్ముడికి తర్పణాలు వదిలితే సంతాన భాగ్యం కలుగుతుందని చెబుతారు.
భీష్మ ఏకాదశి రోజు.. వీటిని తప్పక పాటించాలి:
భీష్మ ఏకాదశి రోజు.. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ రాసి గుమ్మానికి తోరణాలు కట్టాలి.
తల స్నానం చేసి పసుపు రంగు దుస్తులు లేదంటే సుచిగా ఉన్న దుస్తులను ధరించి శ్రీమహా విష్ణువును ఆరాధించాలి. ఉపవాసం ఉండాలి. రాత్రి జాగరణ చేస్తే ఇంకా మంచిది.
భీష్ముడు తండ్రికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్నారు.
ఈ రోజు విష్ణు సహస్రనామాలు చదవడం వల్ల దు:ఖాల నుంచి బయట పడవచ్చు.
Also Read: కేబినెట్‍పై కాదు కార్యవర్గంపై కసరత్తు
కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు గాయపడతాడు. ఆయన అంపశయ్యపై ఉన్నప్పుడు ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని బోధిస్తాడు. ఈ పరమ పవిత్రమైన రోజుని భీష్మ ఏకాదశిగా ప్రజలంతా జరుపుకొంటారు. విష్ణు సహస్రనామాల జపించడం వల్లే.. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయాన్ని అందుకున్నారని చెబుతారు. అదీకాక విష్ణు సహస్రనామ పారాయణం చాలా విశిష్టమైనది. ఇది ప్రతి రోజు పారాయణం చేయడం వల్ల విశేష ఫలితం సంప్రాప్తిస్తుందని చెబుతారు.
Also Read: పిస్తా వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
For Devotional News And Telugu News