హిందీని రుద్దింది కాంగ్రెస్ పార్టీయే!
ABN , Publish Date - Mar 26 , 2025 | 01:47 AM
మార్చి 1న ఆంధ్రజ్యోతిలో పి.చిదంబరం ‘త్రిభాషా విద్యలో హిందీ తప్పనిసరా?’ శీర్షికన వ్యాసం రాస్తూ కాంగ్రెస్ పార్టీ తప్పులను నిర్లజ్జగా సమర్థించారు. హిందీ భాషని త్రిభాషా విధానం ద్వారా అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే...

మార్చి 1న ఆంధ్రజ్యోతిలో పి.చిదంబరం ‘త్రిభాషా విద్యలో హిందీ తప్పనిసరా?’ శీర్షికన వ్యాసం రాస్తూ కాంగ్రెస్ పార్టీ తప్పులను నిర్లజ్జగా సమర్థించారు. హిందీ భాషని త్రిభాషా విధానం ద్వారా అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. మేము స్కూల్లో చదువుకునే రోజుల్లో (1960లలో) హిందీని మూడో భాషగా మానెత్తిన రుద్దింది కాంగ్రెస్ పార్టీయే. హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని డీఎంకే చేపట్టినప్పుడు, దానికి ముందు రాజాజీ, కామరాజ్, సి.సుబ్రహ్మణ్యం వంటి కాంగ్రెస్ నాయకులు ఏమి చెప్పిందీ, త్రిభాషా విధానాన్ని సమర్థించిందీ చిదంబరానికి తెలియదా? త్రిభాషా విధానంలో హిందీ నిర్బంధం కాదు. మాతృ భాష, ఇంగ్లీష్‌తో పాటుగా మరో భారతీయ భాషా చదవడమన్నది ఆ భాషా విధానం రూపొందించినపుడు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా వున్న త్రిగుణ సేన్ చేసిన ప్రకటన చిదంబరానికి తెలియదా? ఆ సమయంలో హర్యానాలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అక్కడి పాఠ శాలలో మూడో భాషగా తెలుగు ప్రవేశపెట్టింది.
ఇప్పుడు తమిళనాడు కూడా హిందీ అమలు చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ఒక దానిని నేర్పవచ్చు. భాషా ఉద్యమ రాజకీయం నడుపుతున్న స్టాలిన్‌ను నిర్ద్వంద్వంగా ఖండించాల్సిన చిదంబరం, డీఎంకే విదిల్చే ఒకటి, రెండు సీట్ల కోసం కక్కుర్తిపడుతూ హిందీ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు పలకటం నీచం. డీఎంకే తమిళనాట తెలుగును ఎలా అణిచివేసిందీ అందరికీ తెలుసు. తమిళులది భాషా అభిమానం కాదు, అది దురభిమానం. ఇతర భాషలను ద్వేషించే దురభిమానం చాలా ప్రమాదకరం.
దుగ్గరాజు శ్రీనివాసరావు
విజయవాడ
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే
Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్
Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ
Read Latest AP News And Telugu News