Share News

Boiled Egg Vs Omlette: ఉడకబెట్టిన గుడ్డు వర్సెస్ ఆమ్లెట్.. వీటిల్లో ఏది బెటరంటే..

ABN , Publish Date - Jan 03 , 2025 | 09:22 AM

బాయిల్డ్ ఎగ్స్‌లో కెలొరీలు తక్కువగా ఉంటాయి. ఆమ్లెట్‌లో పోషకాలు అందులో వాడే ఇతర పదార్థాలను బట్టి ఉంటుంది. కాబట్టి, వ్యక్తులు తమ ఆరోగ్య అవసరాలకు అనుగూణంగా ఎదోకటి ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Boiled Egg Vs Omlette: ఉడకబెట్టిన గుడ్డు వర్సెస్ ఆమ్లెట్.. వీటిల్లో ఏది బెటరంటే..

ఇంటర్నెట్ డెస్క్: విటమిన్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారం కోడి గుడ్లు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆహారంలో ఇవి ముఖ్య భాగం. కొందరు ఉడబెట్టిన గుడ్లు ఇష్టపడితే మరికొందరు ఆమ్లెట్‌ను ఇష్టపడతారు. మరి ఈ రెండిటిలో ఏది బెటర్ అనే ప్రశ్నకు న్యూట్రిషనిస్టులు సవివరమైన సమాధానం ఇచ్చారు (Health).

బాయిల్డ్ గుడ్లల్లో పోషకాలు ఇవే

ఒక ఉడకబెట్టిన గుడ్డులో కెలొరీలు 78 వరకూ ఉంటాయి. ఇందులో ప్రొటీన్లు 6.3 గ్రాములు, కొవ్వులు 5.3 గ్రాములు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు పరిమితంగానే ఉంటాయి. ఇందులో విటమిన్ బీ12, డీ, ఏలతో పాటు ఐరన్, జింక్ వంటి మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. అయితే, బాయిల్డ్ గుడ్లలో పోషకాలు యథాతథంగా ఉంటాయి. దీంతో, కెలొరీలు వద్దనుకునే వారికి ఇది మంచి ప్రత్యామ్నాయం.

Smoking: రోజుకు ఒక్క సిగరెట్ తాగితే ఏం కాదని అనుకుంటున్నారా? ఇది ఎంతటి ప్రమాదమో తెలిస్తే..


ఇక ఆమ్లెట్‌ తయారీలో వినియోగించే పదార్థాలను అనుసరించి ఇందులో పోషకాలు ఉంటాయి. ప్రొటీన్, కెలొరీల పరంగా ఉడకబెట్టిన గుడ్డు, ప్లెయిన్ ఆమ్లెట్‌లో పెద్దగా తేడా ఉండదని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఆమ్లెట్‌కు కూరగాయలు, చీజ్ లేదా మాంసం జత చేసినప్పుడు మాత్రం దాని న్యూట్రియంట్ ప్రొఫైల్ మారుతుంది. కూరగాయలతో ఆమ్లెట్‌కు పీచు పదార్థం, విటమిన్లు, మినరల్స్ జతకూడతాయి, అయితే, చీజ్ లేదా నూనె కారణంగా కెలొరీలు, అనారోగ్యకర కొవ్వులు అధికమవుతాయి.

Meditation: ఈ సంవత్సరం మీ జీవితంలో గొప్ప మార్పులు కోరుకుంటున్నారా? ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి!


రెండింట్లో ఏది బెటర్?

బరువు తగ్గాలనుకునే వారు, కెలొరీలు తగ్గించుకోవాలనుకునే వారికి బాయిల్డ్ గుడ్లు ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ఇది సులువుగా జీర్ణమవుతుందని కాబట్టి ఉదర సంబంధిత సమస్యలున్న వారికి ఉడకబెట్టిన గుడ్లు ఉపయుక్తం. ఇందులోని అధిక ప్రొటీన్, కండరాలు రిపేర్‌కు, పెరుగుదలకు ఉపకరిస్తుంది. ఎముకలు, మెదడుకు కావాల్సిన విటమిన్ డీ, విటమిన్ బీ12ను అందిస్తుంది.

ఇక ఆమ్లెట్‌కు రకరకాల ఇతర పదార్థాలు జత చేర్చే అవకాశం ఉండటంతో ఆయా పదార్థాలను బట్టి పోషకాలు మారుతుంటాయి. అయితే, ఫైబర్ అధికంగా ఉండే వాటిని ఆమ్లెట్‌కు జత చేస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఒక్క వంటకంతో సమతులా ఆహారం తినాలనుకునే వారికి ఆమ్లెట్లు సరైనవని నిపుణులు చెబుతున్నారు. ఇక రెండింట్లో ఏది బెటర్ అనేదానికి స్పష్టమైన సమాధానం ఏదీ లేదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. వ్యక్తులు తమ అభిరుచులు, ఆరోగ్య లక్ష్యాలకు అనుగూణంగా ఏదోకటి ఎంచుకోవాలని సూచిస్తున్నారు.

Read Latest and Health News

Updated Date - Jan 03 , 2025 | 09:22 AM