Share News

Health Tips : అత్యవసర పరిస్థితిలో.. ప్రతి ఇంట్లో ఉండాల్సిన 4 రకాల మందులు..

ABN , Publish Date - Feb 10 , 2025 | 01:50 PM

Essential Medicines list at Home : ఏ ఇంట్లో ఎప్పుడు, ఏ అత్యవసర పరిస్థితి వస్తుందో ఎవరూ చెప్పలేరు. మీ కుటుంబసభ్యుల్లో ఎవరికైనా అకస్మాత్తుగా ఎమర్జెన్సీ సిట్యుయేషన్ ఏర్పడవచ్చు. ఆ పరిస్థితుల్లో వైద్యుడిని సంప్రదించడానికి తగిన సమయం లేకపోవచ్చు లేదా చిన్నపాటి ఆరోగ్య సమస్యలను మీరే తగ్గించుకునేందుకు ఈ మందులు ఉపయోగపడతాయి.

Health Tips : అత్యవసర పరిస్థితిలో.. ప్రతి ఇంట్లో ఉండాల్సిన 4 రకాల మందులు..
Essential Medicines list at Home

Essential Medicines list at Home : జబ్బు ముదిరిపోకముందే సరైన సమయంలో ఔషధం తీసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే మీ ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశం ఉంది లేదా అది మీ ప్రాణానికే ముప్పుగా మారవచ్చు. ఇక ఇంట్లో పిల్లలు, వయసు పై బడినవారు అని తేడా లేకుండా తరచూ ఏదోక అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇక ఎప్పుడు, ఏ అత్యవసర పరిస్థితి వస్తుందో ఎవరూ చెప్పలేరు. మీ కుటుంబసభ్యుల్లో ఎవరికైనా అకస్మాత్తుగా ఎమర్జెన్సీ సిట్యుయేషన్ ఏర్పడవచ్చు. ఆ పరిస్థితుల్లో వైద్యుడిని సంప్రదించడానికి తగిన సమయం ఉండదు. కాబట్టి, ఈ మందులు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఈ 4 మందులు తప్పక ఉంచుకోవాలి.


1.నొప్పి నివారణ మందులు (పారాసెటమాల్ లేదా ఆస్ప్రిన్) :

కొన్నిసార్లు రాత్రి భోజనం తర్వాత చాలామందికి అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో అప్పటికప్పుడు బయటికి వెళ్లడం కాస్త కష్టంగా అనిపిస్తుంది. పారాసెటమాల్ లేదా ఆస్ప్రిన్ ఆ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ నొప్పిని నివారించంతో పాటు తీవ్ర జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఉదయం నిద్రలేచేసరికే జ్వరం అదుపులోకి వచ్చేలా చేస్తాయి. వ్యాధి తీవ్రతను తగ్గించి సంప్రదించేవరకూ మీకు ఉపశమనం కలిగిస్తాయి. ఒకవేళ మీకు ఇంకా నయం కాలేదు అనుకుంటే మరుసటి రోజు వైద్యుడిని సంప్రదించవచ్చు.


2. అలెర్జీ నిరోధక ఔషధం (యాంటీహిస్టామైన్) :

దురద, తుమ్ము, ముక్కు కారటం వంటి అలెర్జీ లక్షణాలను తగ్గించడంలో యాంటీ అలెర్జీ ఔషధం సహాయపడుతుంది. ముక్కు కారటం అనేది చిన్న సమస్యగానే కనిపించినా అత్యంత బాధాకరంగా అనిపించి అసౌకర్యం, చికాకు కలిగిస్తుంది. ఒకసారి ముక్కు కారడం ప్రారంభించిన తర్వాత శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. ఆ తరువాత, ఖచ్చితంగా తలనొప్పి వస్తుంది. అలాంటి సందర్భాల్లో యాంటీహిస్టామైన్ దగ్గర ఉంచుకుంటే ఎంతో మేలు.


3. అతిసార నిరోధక ఔషధం (లోపెరమైడ్) :

ఇంట్లో కొన్నిసార్లు ఆహారం లేదా జీర్ణక్రియ సమస్యల వల్ల విరోచనాల సమస్య తలెత్తవచ్చు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఒంటరిగా డాక్టర్ దగ్గరకు వెళ్లేందుకు వీలుకాదు. అదే లోపెరమైడ్ ఇంట్లో ఉంటే అతిసార నిరోధక ఔషధం విరేచనాలను ఆపడానికి సహాయపడుతుంది. తక్షణ ఉపశమనాన్ని అందించి విరేచనాలను ఆపుతుంది.


4. బ్యాండ్-ఎయిడ్స్, యాంటీసెప్టిక్ క్రీములు :

బ్యాండ్-ఎయిడ్స్, యాంటీసెప్టిక్ క్రీములు శరీరంపై ఏర్పడిన చిన్న కోతలు, గాయాలను నయం చేసేందుకు సాయపడుతాయి. ఈ మందులతో పాటు మీ ఇంట్లో ప్రథమ చికిత్సకు సంబంధించిన వస్తు సామగ్రిని ఉంచుకోవడం ముఖ్యం. అయితే, మందులు వాడే ముందు ఎక్స్‌డేట్ చెక్ చేయడం మర్చిపోకండి. వైద్యుడి సలహాతోనే ఈ మందులను ఉపయోగించాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.


ఇవి కూడా చదవండి..

Headache vs Migrane : పదే పదే తలనొప్పి వస్తుందా .. ఈ లక్షణాలు కనిపిస్తే మైగ్రేన్..?

Viral Video : ఈ సింపుల్ టెస్ట్‌తో.. నకిలీ పనీర్ ఏదో ఈజీగా కనిపెట్టేయవచ్చు..

Apple: ఆపిల్‌ను ఎట్టిపరిస్థితిలోనూ ఇలా తినకండి..

మరిన్ని హెల్త్ , తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 10 , 2025 | 03:05 PM