Share News

ROAD: నెరవేరిన గ్రామస్థుల కల

ABN , Publish Date - Mar 27 , 2025 | 12:08 AM

ఆ గ్రామానికి తారు రోడ్డు అనేది గ్రామస్థుల ఏళ్లనాటి కల. గ్రామ ఏర్పాటై దాదాపు నాలుగు తరాలు దాటింది. అయినా ఆ గ్రామానికి వెళ్లాలంటే నిత్యం ఒడిదుడుకుల ప్రయాణమే. మట్టిరోడ్డులోని అడుగడుగునా గుంతల్లో గ్రామస్థులు నిత్యం అవస్థల ప్రయాణం సాగించేవారు.

ROAD: నెరవేరిన గ్రామస్థుల కల
The road to MB Pally has been completed.

- ఎంబీ పల్లి రోడ్డు నిర్మాణం పూర్తి

- త్వరలో ప్రారంభం... స్థానికుల్లో ఆనందం

అనంతపురం రూరల్‌, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ఆ గ్రామానికి తారు రోడ్డు అనేది గ్రామస్థుల ఏళ్లనాటి కల. గ్రామ ఏర్పాటై దాదాపు నాలుగు తరాలు దాటింది. అయినా ఆ గ్రామానికి వెళ్లాలంటే నిత్యం ఒడిదుడుకుల ప్రయాణమే. మట్టిరోడ్డులోని అడుగడుగునా గుంతల్లో గ్రామస్థులు నిత్యం అవస్థల ప్రయాణం సాగించేవారు. 2018లో గ్రామానికి బీటీ రోడ్డు మం జూరైంది. నిధులు విడుదలయ్యాయి. పనులు ప్రారంభించారు. ఇంతలోనే ఎన్నికలు వచ్చాయి. గ్రామస్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజాప్రతినిధులు రోడ్డును పూర్తిగా విస్మరిం చారు. ఐదేళ్ల కాలంలో గంపెడు మట్టి వేసిన పాపన పోలేదు. మళ్లీ ఎన్నిక లు వచ్చాయి. ప్రభుత్వం మారింది. స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే నెల రోజుల కిందట మండ లంలోని ఆలమూరు పంచాయతీ ఎంబీ పల్లి రోడ్డు పనులు ప్రారంభమ య్యాయి. ఇటీవల రోడ్డు నిర్మాణం పూర్తయింది. తుది మెరుగులు దిద్దుకుం టున్నాయి. ఇక గ్రామస్థులు రయ్‌..రయ్‌ అంటూ రాక పోకలు సాగిస్తున్నా రు. త్వరలోనే ఎమ్మెల్యే పరిటాల సునీత రోడ్డును ప్రారంభించనున్నారు.

ఫలించిన గ్రామస్థుల ఆశలు

గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్డు నిర్మాణానికి పనులు ప్రా రంభించడంతో గ్రామస్థులు సంతోషించారు. అయితే ఎన్నికలు వచ్చి వైసీపీ అధికారంలోకి రావడంతో గ్రామస్థుల అవస్థలు మళ్లీ మెదటి కొచ్చాయి. వైసీపీ ప్రజాప్రతినిధులు రోడ్డు నిర్మాణం పూర్తి అటెక్కించేశారు. తిరిగి రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే గ్రామ స్థులకు ఇచ్చిన హామీమేరకు రోడ్డు నిర్మాణం తిరిగి ప్రారంభించారు. రూ.2.5 కోట్లతో గ్రామ సమీపంలో కొంత సీసీ రోడ్డు, మిగిలినది బీటీ రోడ్డు వేశారు. దాదాపు నాలుగు కిలో మీటర్ల మేర రోడ్డు నిర్మించారు. దీంతో తమ కొన్నేళ్ల ఆశ ఫలించిందని ఎంబీపల్లి గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 27 , 2025 | 12:08 AM