Oscars 2025: ఇండియన్ సినిమా ``అనూజ``కు అస్కార్‌లో చోటు.. ``ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్``కు నో ఛాన్స్..
ABN , Publish Date - Jan 23 , 2025 | 09:30 PM
ఆస్కార్ అవార్డులు-2025లో భారతీయ సినిమాకు ప్రాతినిధ్యం దక్కింది. ప్రియాంకా చోప్రా నిర్మించిన ``అనూజ`` సినిమాకు బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో చోటు లభించింది. ఈ విభాగంలో పరిశీలన కోసం ఏకంగా 180 సినిమాలు రాగా, వాటిల్లో ఐదింటిని నామినేట్ చేశారు.

ఆస్కార్ అవార్డులు-2025లో (Oscars 2025) భారతీయ సినిమాకు ప్రాతినిధ్యం దక్కింది. ప్రియాంకా చోప్రా నిర్మించిన ``అనూజ`` (Anuja) సినిమాకు బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో చోటు లభించింది. ఈ విభాగంలో పరిశీలన కోసం ఏకంగా 180 సినిమాలు రాగా, వాటిల్లో ఐదింటిని నామినేట్ చేశారు. 97వ అకాడమీ అవార్డుల కోసం నామినేషన్లను గురువారం సాయంత్రం ప్రకటించారు. వాటిల్లో ``అనూజ`` ఒకటి. ఈ షార్ట్ ఫిల్మ్‌ను ప్రియాంకా చోప్రా (Priyanka Chopra), గునీత్ మోంగా నిర్మించగా, ఆడమ్ జే గ్రావ్స్ దర్శకత్వం వహించారు (Anuja in Oscars 2025).
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ``అనూజ``తో పాటు ``ఏలియన్``, ``ఐయామ్ నాట్ ఏ రోబో``, ``ది లాస్ట్ రేంజర్``, ``ఏ మ్యాన్ హు వుడ్ నాట్ రిమైన్ సైలెంట్`` సినిమాలున్నాయి. ఈ ఐదింటిలో విజేతను ఆస్కార్ అవార్డుల వేడుకలో ప్రకటిస్తారు. కాగా, గునీత్ మోంగా సినిమాకు ఇది మూడో ఆస్కార్ ఎంట్రీ. ఇంతకు ముందు గునీత్ మోంగా నిర్మించిన ``ది ఎలిఫెంట్ విస్పర్స్``, ``పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్`` సినిమాలు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నాయి. ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో మార్చి 2వ తేదీన జరగబోతోంది.
బాల కార్మికుల జీవితాల్లోని చీకటి కోణాన్ని ఈ ``అనూజ`` చిత్రంలో ఆవిష్కరించారు. బట్టల ఫ్యాక్టరీలో పని చేసే అనూజ అనే 9 ఏళ్ల పాప, ఆమె అక్క పాలక్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. కాగా, అమెరికా మాజీ అధ్యక్షుడు కూడా ప్రశంసించిన మరో సినిమా ``ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్`` మాత్రం ఆస్కార్ ఎంట్రీ సాధించలేకపోయింది. ఇంటా, బయటా విపరీతంగా ప్రశంసలు అందుకున్న ``ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్`` కచ్చితంగా ఆస్కార్ ఎంట్రీ సాధిస్తుందని అందరూ అనుకున్నారు. దీనిని బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్‌కు పంపించారు. అయితే ఆ సినిమా ఇతర చిత్రాలతో పోటీ పడలేకపోయింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..