AIDS crisis: రాబోయే నాలుగేళ్లలో 63లక్షల ఎయిడ్స్ మరణాలు!
ABN , Publish Date - Feb 11 , 2025 | 05:18 AM
అమెరికా ఇస్తున్న అంతర్జాతీయ సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణమని ఐరాస ఆరోపిస్తోంది.

అనాథలవ్వనున్న 34 లక్షల చిన్నారులు
ఐరాస ఎయిడ్స్ విభాగం ఆందోళన
ట్రంప్ సాయం నిలిపివేయడమే కారణం!!
ఎయిడ్స్ మహమ్మారి 2029కల్లా విశ్వరూపం చూపే ప్రమాదముందని ఐక్య రాజ్య సమితి(ఐరాస) ఎయిడ్స్ విభాగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమెరికా ఇస్తున్న అంతర్జాతీయ సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణమని ఐరాస ఆరోపిస్తోంది. మూడు దశాబ్దాలకు పైగా ఐరాస 160కి పైగా దేశాల్లో ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలను చేపడుతోంది. ఐరాసకు అమెరికా ఏటా పేదరిక నిర్మూలన, వ్యాధుల నిర్మూలన, మానవతాసాయానికి రూ.3,83,160 కోట్లను విరాళంగా అందజేస్తోంది. ఈ విరాళాలను యూఎ్‌సఎయిడ్ ఫండ్ నుంచి పంపిణీ చేస్తారు. ఈ ఎయిడ్‌లో పనిచేసే 13 వేల మంది సిబ్బందిని తొలగించడమే కాకుండా.. గ్రాంట్లపై 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తూ ట్రంప్ ఉత్తర్వులిచ్చారు. దాంతో.. యూఎన్‌ఎయిడ్స్‌కు అందే విరాళాలు కూడా నిలిచిపోయాయి.
ఎయిడ్స్ కేసులు ఎక్కువగా ఉన్న ఇథియోఫియా, ఉగాండా, మొజాంబిక్ వంటి దేశాలకు అమెరికా నుంచి ఏటా రూ.3,498 కోట్ల సాయం అందుతుందని, ఈ సాయం ఆగిపోతే.. ఎయిడ్స్ కేసులు ఏ స్థాయిలో పెరుగుతాయో ఊహించలేమని ఐరాస ఎయిడ్స్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ బయాన్‌యిమా ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘2029 కల్లా 63 లక్షల ఎయిడ్స్ మరణాలు సంభవిస్తాయి. కొత్తగా 87 లక్షల మంది ఎయిడ్స్ బారిన పడే ప్రమాదముందని అంచనా. అంతేకాదు.. ఎయిడ్స్ బాధితుల పిల్లలు సుమారు 34 లక్షల మంది అనాథలుగా మారుతారు’’ అని ఆమె ఆమె వాపోయారు. కాగా, యూఎ్‌సఎయిడ్‌కు నిధులను నిలిపివేయడానికి కారణాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెస్లా అధినేత ఈలాన్ మస్క్ ఇప్పటికే పలు వేదికలపై వివరించారు. యూఎన్‌ఎయిడ్‌లో పనిచేస్తున్న వారు ఉగ్రవాదులు/తీవ్రవాదులకు సహకరిస్తున్నారని ఆరోపించారు. అందుకే.. ఆ సంస్థలో పనిచేస్తున్న వారిని తొలగించామన్నారు.
- సెంట్రల్ డెస్క్
ఇవి కూడా చదవండి..
Maha Kumbhmela 2025 : మహా కుంభమేళాకు రాష్ట్రపతి.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం..
Delhi elections: హామీల అమలు బీజేపీకి సవాలే!
For More National News and Telugu News..