Share News

India: 6% పట్టణ కుటుంబాలకే రక్షిత కుళాయి నీరు

ABN , Publish Date - Mar 23 , 2025 | 04:11 AM

కేవలం 6% ఇళ్లకు మాత్రమే మున్సిపాలిటీల నుంచి తాగడానికి నాణ్యమైన కుళాయి నీరు అందుతోందని తాజా సర్వే వెల్లడించింది. 62ు కుటుంబాలు సురక్షితమైన తాగునీటి కోసం వాటర్‌ ప్యూరిఫయర్స్‌, ఆర్వో సిస్టమ్స్‌ వంటి ఆధునిక నీటి శుద్ధి (ఫిల్టరేషన్‌) విధానాలపై ఆధారపడుతున్నాయని పేర్కొంది.

India: 6% పట్టణ కుటుంబాలకే రక్షిత కుళాయి నీరు

లోకల్‌ సర్కిల్స్‌ తాజా సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 22: దేశంలోని పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఆందోళనర అంశంగా మారింది. కేవలం 6ు ఇళ్లకు మాత్రమే మున్సిపాలిటీల నుంచి తాగడానికి నాణ్యమైన కుళాయి నీరు అందుతోందని తాజా సర్వే వెల్లడించింది. 62ు కుటుంబాలు సురక్షితమైన తాగునీటి కోసం వాటర్‌ ప్యూరిఫయర్స్‌, ఆర్వో సిస్టమ్స్‌ వంటి ఆధునిక నీటి శుద్ధి (ఫిల్టరేషన్‌) విఽధానాలపై ఆధారపడుతున్నాయని పేర్కొంది. శనివారం ‘వరల్డ్‌ వాటర్‌ డే’ సందర్భంగా లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ తన సర్వే వివరాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 302 జిల్లాల్లో 30 వేలకు పైగా కుటుంబాలపై సర్వే చేశారు. తమ ఇళ్లకు పైపుల ద్వారా సరఫరా అవుతున్న నీటి నాణ్యతపై ప్రశ్నించగా.. కేవలం 30ు కుటుంబాలు మాత్రమే ‘మంచి’గా ఉన్నాయని పేర్కొన్నాయి. అసలు తమకు కుళాయి నీరు సరఫరానే లేదని 12 శాతం మంది చెప్పారు.


ఇవి కూడా చదవండి:

Gmail: జీ మెయిల్ నుంచి కొత్త ఏఐ ఫీచర్..ఆ పనులు చేయడంలో కూడా హెల్పింగ్..


WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ


Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..


PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 23 , 2025 | 04:11 AM