Share News

Mahakumbh: మీకు ముందుంది మృత్యుకుంభ్... మమతకు అఖిల భారత సంత్ సమితి వార్నింగ్

ABN , Publish Date - Feb 18 , 2025 | 09:58 PM

మమతా బెనర్జీ చేసిన 'మృత్యుకుంభ్' వ్యాఖ్యలపై అఖిల్ భారతీయ సంత్ సమితి తీవ్ర ఆక్షేపణ తెలిపింది. మమతా బెనర్జీ రాజకీయ ఆశలకు రాబోయే పశ్చిమబెంగాల్‌ ఎన్నికలే చివరివవుతాయని హెచ్చరించింది.

Mahakumbh: మీకు ముందుంది మృత్యుకుంభ్... మమతకు అఖిల భారత సంత్ సమితి వార్నింగ్

న్యూఢిల్లీ: ప్రయాగ్‌రాజ్‌లో కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న మహాకుంభ్‌ను 'మృత్యుకుంభ్'గా సంబోధిస్తూ అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. బీజేపీతో పాటు పలు హిందూ ధార్మిక సంస్థలు మమత వ్యాఖ్యలను ఖండిస్తున్నాయి. మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై అఖిల్ భారతీయ సంత్ సమితి తీవ్ర ఆక్షేపణ తెలిపింది. మమతా బెనర్జీ రాజకీయ ఆశలకు రాబోయే పశ్చిమబెంగాల్‌ ఎన్నికలే చివరివవుతాయని హెచ్చరించింది.

Mamata Banerjee: మహాకుంభ్ 'మృత్యుకుంభ్'గా మారుతోంది... అసెంబ్లీలో మండిపడిన మమత


పశ్చిమబెంగాల్, జార్ఖాండ్, బీహార్, ఒడిశా హిందువులంతా మహాకుంభ్‌ అమృత స్నానాలకు తరలివచ్చారని, ఇంత పెద్దఎత్తున మహాకుంభ్‌రకు వస్తుండటంతో సహజంగానే మమతకు దిక్కుతోచడం లేదని అఖిల్ భారతీయ సంత్ సమితి చీఫ్ స్వామి జితేంద్రానంద సరస్వతి వ్యాఖ్యానించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఆమె రాజకీయ ఆకాంక్షలకు 'మృత్యుకుంభ్' అవుతాయని హెచ్చరించారు.


మమత ఏమన్నారు?

పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో మమతా బెనర్జీ మంగళవారంనాడు మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా (Maha Kumbh) నిర్వహణలోపాలపై కూడా అక్కడి బిజేపీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మమత తప్పుపట్టారు. నిర్వహణా లోపాల వల్ల మహాకుంభ 'మృత్యుకుంభ్'‌గా మారుతోందంటూ విమర్శించారు. ''ఇది మృత్యుకుంభ్... నేను మహాకుంభ్‌ను గౌరవిస్తాను, గంగామాతను గౌరవిస్తాను. కానీ అక్కడ సరైన ప్లానింగ్ లేదు. ఎంతమంది కోలుకున్నారు? డబ్బున్న వాళ్లు, వీఐపీలకు క్యాంపులు (టెంట్లు) దొరుకుతున్నాయి. పేదలకు ఎలాంటి ఏర్పాట్లు లేవు. మేళాలో తొక్కిసలాట జరగడం సహజమే అయినా అలా జరక్కుండా ఏర్పాట్లు చేయడం ముఖ్యం. అందుకు మీరు ఎలాంటి ప్లానింగ్ చేశారు'' అంటూ కేంద్రం, యూపీలోని బీజేపీ ప్రభుత్వాన్ని మమత నిలదీశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Rahul Gandhi: అర్ధరాత్రి నిర్ణయం సరికాదు... సీఈసీ ఎంపికపై రాహుల్

Bengaluru: బెంగళూరులో తాగు నీటిని ఇతర అవసరాలకు వాడితే భారీ జరిమానా

Mahakumbh: 26న చిట్టచివరి స్నాన ఘట్టం... హై అలర్ట్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 18 , 2025 | 09:58 PM