Share News

Viral Video: దెబ్బలు పడతాయ్ రాజా.. దెబ్బలు పడతాయ్ రో..

ABN , Publish Date - Mar 27 , 2025 | 03:24 PM

ఆ బాలుడు మైకంలో తేలిపోతున్నట్లు ఆమె దగ్గరకు వచ్చి డ్యాన్స్ చేయటం మొదలెట్టాడు. అప్పుడు ఊహించని సంఘటన జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ బాలుడిని తిట్టిపోస్తున్నారు.

Viral Video: దెబ్బలు పడతాయ్ రాజా.. దెబ్బలు పడతాయ్ రో..
Viral Video

‘వాళ్లతో ఫోటో వీళ్లతో ఫోటో ఆల్బమ్‌లో అంటించు.. మరి నాతో దిగిన బొమ్మ బాబు లాకర్లో దాచుంచు.. పుసుక్కున ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా.. దెబ్బలు పడతాయ్ రో..‘ అని పుష్ఫ 2 సినిమాలో శ్రీల ఐటమ్ సాంగ్ ఉంటుంది. అచ్చం ఈ పాటకు సరిపోయేలా కొద్దిరోజుల క్రితం ఓ సంఘటన జరిగింది. అమ్మాయితో కొంచెం ఓవర్‌గా ప్రవర్తించిన ఓ బాలుడికి .. తండ్రి దెబ్బలతో బుద్ధి చెప్పాడు. కిందపడేసి చావగొట్టాడు. ఉత్తర భారత దేశంలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో ప్రకారం.. ఓ యువతి స్టేజిపై డ్యాన్స్ చేస్తూ ఉంది. చుట్టూ ఉన్న జనం ఎంతో ఆసక్తిగా ఆ డ్యాన్స్ చూస్తూ ఉన్నారు.


కొద్దిసేపటి తర్వాత ఓ బాలుడు అక్కడికి వచ్చాడు. ఆమె చేతిలో డబ్బులు పెట్టాడు. తర్వాత పూనకం వచ్చినట్లు డ్యాన్స్ చేయటం మొదలెట్టాడు. అప్పుడు జనంలోంచి ఓ వ్యక్తి కర్రతో అక్కడికి వచ్చాడు. బాలుడి వీపు మీద టాప్‌మని కొట్టాడు. తర్వాత కిందా మీద పడేసి చావకొట్టాడు. అక్కడ ఉన్న కొంతమంది జనం ఆ వ్యక్తిని అడ్డుకున్నారు. ఆ బాలుడు అక్కడినుంచి పారిపోయాడు. బాలుడిని కొట్టిన ఆ వ్యక్తి తండ్రి అని తెలుస్తోంది. అయితే, అందులో క్లారిటీ లేదు. సంఘటన ఎప్పుడు? సరిగ్గా ఎక్కడ జరిగిందో తెలీదు. వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ చిన్నప్పుడే ఇంత దారుణంగా ఉన్నాడంటే పెద్దయ్యాక ఏమవుతాడో’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


దొంగతనంలో భార్యకు ట్రైనింగ్

ఓ వ్యక్తి దొంగతనం చేయటంలో భార్యకు ట్రైనింగ్ ఇచ్చాడు. ఓ ప్లాస్టిక్ డబ్బాను తీసుకుని, దాన్ని దూరం నుంచి చేత్తో విసిరికొడితే ఆమె పట్టుకునేలా శిక్షణ ఇచ్చాడు. బాటిల్‌ను ఇలా తోయగానే.. ఆమె టక్కన పట్టేసుకుంది. శిక్షణ తర్వాత ఇద్దరూ దొంగతనానికి వెళ్లారు. ఓ షాపులో తినుబండారాల డబ్బాను అతడు ఆమె మీదికి విసిరాడు. ఆమె ట్రైనింగ్‌లో నేర్చుకున్న దాని ప్రకారం.. డబ్బాను టక్కున పట్టేసుకుంది. ఆ వెంటనే దాంతో అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత అతడు కూడా అక్కడినుంచి వెళ్లిపోయాడు.అయితే.. ఇది నిజంగా జరిగిన సంఘటన కాదు..కామెడీ కోసం చేసినట్లు తెలుస్తోంది.


వీడియోను కింద చూడొచ్చు..


ఇవి కూడా చదవండి:

భార్యకు ప్రియుడితో పెళ్లి..

Viral Video: మరీ అంత ఓవరాక్షన్ అవసరమా..

Zelenskyy: జెలన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. పుతిన్ త్వరలోనే చనిపోతాడు

Updated Date - Mar 27 , 2025 | 04:10 PM