Uddhav Thackeray: ద్రోహి అనడం తప్పు కాదు... కునాల్‌ను సమర్ధించిన ఉద్థవ్ థాకరే
ABN , Publish Date - Mar 24 , 2025 | 03:35 PM
కునాల్ కమ్రా షో జరిగిన హోటల్‌పై దాడిలో తమ పార్టీ కార్యకర్తల ప్రమేయం లేదని ఉద్ధవ్ థాకరే వివరణ ఇచ్చారు. అది 'గద్దర్ సేన' పని అని, ద్రోహం (గద్దర్) ఎవరి రక్తంలో ఉందో వాళ్లు ఎప్పుడూ శివసైనికులు కాలేరని అన్నారు.

ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా(Kunala Kamra) చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దుమారం ముదురుతోంది. షిండేను 'ద్రోహి'గా కునాల్ అభివర్ణించాన్ని శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే సమర్ధించారు.'ద్రోహి' అని పిలవడం తప్పేమీ కాదని అన్నారు. కునాల్ కమ్రా తప్పేమీ మాట్లాడలేదని, ద్రోహి అనడమంటే ఒకరిపై దాడి చేయడం కాదని చెప్పారు. ''కునాల్ పూర్తి పాట వినండి. మిగతా వారికి కూడా వినిపించండి'' అని ఉద్ధవ్ అన్నారు.
Devendra Fadnavis: క్షమాపణ చెప్పాలి.. కునాల్ కమ్రా వ్యాఖ్యలపై ఫడ్నవిస్ ఆగ్రహం
హాబిటాట్ స్టూడియోపై దాడిలో మా ప్రమేయం లేదు
కునాల్ కమ్రా షో జరిగిన హోటల్‌పై దాడిలో తమ పార్టీ కార్యకర్తల ప్రమేయం లేదని కూడా ఉద్ధవ్ థాకరే వివరణ ఇచ్చారు. అది 'గద్దర్ సేన' పని అని, ద్రోహం (గద్దర్) ఎవరి రక్తంలో ఉందో వాళ్లు ఎప్పుడూ శివసైనికులు కాలేరని అన్నారు.
ఖార్ ప్రాంతంలోని ది యూనికాంటినెంటల్ హోటల్‌లోని హాబిటాట్ కామిడీ క్లబ్‌లో కునాల్ కమ్రా షో జరిగింది. మహారాష్ట్ర రాజకీయాల గురించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శివసేన నుంచి శివసేన బయటకు వచ్చిందని, ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయిందని అన్నారు. ఏక్‌నాథ్ షిండేను పరోక్షంగా ద్రోహిగా అభివర్ణిస్తూ, 'దిల్ తో పాగల్ హై' అనే హిందీ పాటలోని చరణాలను రాజకీయ కోణంలో మార్చి పాడారు. కమ్ర వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. మహారాష్ట్ర పాపులర్ సీఎం, డిప్యూటీ సీఎంను ద్రోహి అంటూ కామెడీ చేస్తారా? ఇది కామెడీనా? వల్గారిటీనా? అంటూ శివసేన నేత షైనా ఎన్‌సీ మండిపడ్డారు. ఆ పార్టీ నేత ముర్జీ పటేల్ ఎంఐడీసీ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. కునాల్ కమ్ర వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన కార్యకర్తలు కునాల్ షో సభావేదికను ధ్వంసం చేశారు. వారిపై కామెడీ క్లబ్ కేసు పెట్టింది. పోలీసులు రంగంలోకి దిగి పలువురు శివసేన కార్యకర్తలను అదుపులోనికి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..