Canada: మధ్యంతర ఎన్నికలకు కెనడా కొత్త ప్రధాని పిలుపు
ABN , Publish Date - Mar 24 , 2025 | 02:20 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కెనడాపై విధిస్తున్న సుంకాల అంశమే ఈ సారి ఎన్నికల ప్రచారంలో కీలకం కానుంది. జస్టిన్ ట్రుడో స్థానంలో కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన లిబరల్ నాయకుడు కార్నీ.. సుంకాల అంశాన్నే తొలి రోజు ఎన్నికల ప్రచారంలో లేవనెత్తారు.

ఒట్టావా, మార్చి23: కెనడాలో మధ్యంతర ఎన్నికలకు నూతన ప్రధాని మార్క్ కార్నీ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 28న మొత్తం 343 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కెనడాపై విధిస్తున్న సుంకాల అంశమే ఈ సారి ఎన్నికల ప్రచారంలో కీలకం కానుంది. జస్టిన్ ట్రుడో స్థానంలో కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన లిబరల్ నాయకుడు కార్నీ.. సుంకాల అంశాన్నే తొలి రోజు ఎన్నికల ప్రచారంలో లేవనెత్తారు. కెనడా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఐదు వారాల పాటు ఎన్నికల ప్రచారం జరగనుంది. లిబరల్స్, కన్జర్వేటివ్‌ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది.