Share News

PM Modie: ఢిల్లీ అభివృద్ధిని పరుగులు తీయిస్తా: మోదీ

ABN , Publish Date - Feb 08 , 2025 | 07:16 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులు స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు జెండాలు ఊపుతూ, నినాదాలు హోరెత్తింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర సీనియర్ నేతలు ఈ విజయోత్సవంలో పాల్గొన్నారు.

PM Modie: ఢిల్లీ అభివృద్ధిని పరుగులు తీయిస్తా: మోదీ

న్యూఢిల్లీ: దశాబ్దం పాటు పాలన సాగించిన "ఆప్'' ప్రభుత్వానికి ఉద్వాసన పలికి ఢిల్లీ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారు. 70 సీట్లలో బీజేపీ 48 సీట్లలో ఘనవిజయం సాధించడంతో పార్టీ ప్రధాన కార్యాలయంలో శనవారం సాయంత్రం విజయోత్సవం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులు స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు జెండాలు ఊపుతూ, నినాదాలు హోరెత్తింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర సీనియర్ నేతలు ఈ విజయోత్సవంలో పాల్గొన్నారు.

Delhi Election Results: బీజేపీ క్లీన్ స్వీప్.. 48 స్థానాలతో విజయకేతనం


యమునా మాయి కీ జై

ప్రధానమంత్రి "యమునా మాయి కీ జై'' అనే నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆప్‌దా ప్రభుత్వం నుంచి విముక్తులై బీజేపీ పాలనా శకం ప్రారంభం కానుండటంతో ఢిల్లీ ప్రజలు ఎంతో ఉపశమనంతో, ఉల్లాసంగా ఉన్నారని అన్నారు. ''21వ శతాబ్దంలో సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని ఢిల్లీ వాసులందరికీ లేఖ రాశాను. ఈరోజు ఢిల్లీ ప్రజలంతా నాపై విశ్వాసం ఉంచినందుకు శిరస్సు వంచి అభివాదం చేస్తున్నాను. ప్రజలంతా ఎంతో ప్రేమతో ఆశీర్వదించారు. ఇందుకు ప్రతిగా ఢిల్లీ శ్రీఘ్ర అభివృద్ధికి పాటుపడతానిని హామీ ఇస్తున్నాను'' అని మోదీ అన్నారు.


అభివృద్ధి, విజన్, నమ్మకం గెలిచింది

అభివృద్ధి, విజన్, నమ్మకానికి దక్కిన విజయమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయమని మోదీ అన్నారు. గందరగోళం, దురహంకారం, వంచనా రాజకీయాలను ఢిల్లీ ప్రజలు ఈరోజు తిప్పికొట్టారని, ఈ విజయం అవిశ్రాంతంగా పోరాడిన ప్రతి బీజేపీ కార్యకర్తకు దక్కుతుందని అభినందించారు. మార్పు కోరుతూ ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం సిటీగా పరిమితం కాదని, యావద్దేశానికి వర్తించే చరిత్రాత్మక తీర్పు అని మోదీ శ్లాఘించారు. భిన్న సంస్కృతులకు నిలయమైన ఢిల్లీని 'మినీ హిందుస్థాన్' అని కొనియాడారు.


ఇవి కూడా చదవండి

Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..

Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..

Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ

For More National News and Telugu News..

Updated Date - Feb 08 , 2025 | 07:37 PM