Share News

Viral Video: మీ దుంపలు తెగ.. మీ హనీమూన్ వీడియో జనాలకు అవసరమా..

ABN , Publish Date - Mar 25 , 2025 | 03:23 PM

ఆ జంటకు కొన్ని రోజుల క్రితమే పెళ్లయింది. ప్రస్తుతం హనీమూన్ ట్రిప్‌లో ఉంది. మనాలిలోని ఓ హోటల్ గదిలో హనీమూన్ ఏర్పాట్లు జరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియోను కొత్త పెళ్లి కొడుకు సోషల్ మీడియాలో పెట్టేశాడు.

Viral Video: మీ దుంపలు తెగ.. మీ హనీమూన్ వీడియో జనాలకు అవసరమా..
Viral Video

జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అని తెలుగులో ఓ సామెత ఉంది. మనుషులందరి ఆలోచనలు.. వారి ఆహారపు అలవాట్లు ఒకేలా ఉండవు అని దాని అర్థం. మనకు చాలా బాధగా.. భయంకరంగా అనిపించింది. మరొకరికి చాలా ఈజీగా అనిపించొచ్చు. మనకు సంతోషాన్ని ఇచ్చేది.. అవతలి వాళ్లకు బాధను కలిగించొచ్చు. ఒక్కసారి సోషల్ మీడియాలోకి వచ్చి చూస్తే.. ఎవరి పిచ్చి ఏంటో క్షణాల్లో అర్థం అయిపోతుంది. ఇలా ఉన్నారేంట్రా అనిపిస్తుంది. సోషల్ మీడియాలో కనిపించే కొన్ని పోస్టులు మనకు నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని పిచ్చెక్కిపోయేలా చేస్తూ ఉంటాయి. అలాంటిదే ఈ సంఘటన. కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ జంట తమ హనీమూన్ సెలెబ్రేషన్ వీడియోను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.


ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం షావోన్ మిత్రా.. అంకితలకు పెళ్లయింది. ప్రస్తుతం హనీమూన్ మూడ్‌లో ఉన్నారు. హనీమూన్ ట్రిప్‌లో భాగంగా మనాలి వెళ్లారు. అక్కడ హనీమూన్‌కు సంబంధించి.. హోటల్ గదిలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఆ ఏర్పాట్లు, మిగిలిన సెలెబ్రేషన్స్‌కు సంబంధించి మొత్తం వీడియో తీశారు. ఆ వీడియోను షావోన్ మిత్ర తన ఇన్‌స్టా‌గ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. 2 మిలియన్స్‌కు పైగా వ్యూస్ తెచ్చుకుంది. 31 వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. కొన్ని వేల మంది కామెంట్లు చేశారు. అయితే, ఆ కామెంట్లలో చాలా వరకు నెగిటివ్ కామెంట్లే ఉన్నాయి.


‘ మీ దుంపలు తెగ.. మీ హనీమూన్ వీడియో మాకు అవసరమా’..‘ ఈ మధ్య కాలంలో జనాలకు బుర్ర పని చేయకుండా పోతోంది.. పర్సనల్ విషయాలు కూడా పబ్లిక్‌లో పెట్టేస్తున్నారు’..‘ మీ కొద్దిగైనా సిగ్గుందా.. ఇలాంటి వీడియోలా పెట్టేది’ అంటూ మండిపడుతున్నారు. మరికొంత మంది హద్దుల దాటి బూతులు తిడుతున్నారు. దీంతో కామెంట్స్‌‌ను ఆఫ్ చేశారు. కాగా, గతంలో ఈ జంటకు మించి మరికొన్ని జంటలు తమ హనీమూన్ వీడియోలను సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాయి. ఆ వీడియోలు దారుణంగా ఉన్నా కూడా వాటిని జనాల్లోకి వదిలాయి. వాటిని చూసిన జనం జంటలపై విరుచుకుపడ్డారు. కామెంట్ల ద్వారా బుద్ది చెప్పారు.


ఇవి కూడా చదవండి:

నిన్న బర్డ్‌ఫ్లూ.. ఇప్పుడు ఎఫ్‌పీవీ.. ఏంటి ఈ కొత్త వైరస్

Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ

Delhi Budget 2025: లక్ష కోట్లతో చారిత్రక బడ్జెట్

Updated Date - Mar 25 , 2025 | 04:03 PM