Disha Salian: ఆదిత్య ఠాక్రేపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి
ABN , Publish Date - Mar 21 , 2025 | 04:45 AM
దిశ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె తండ్రి సతీశ్ సాలియన్ బాంబే హైకోర్టును ఆశ్రయించడం మహారాష్ట్రలో మరోసారి రాజకీయ దుమారం రేపింది. ఈ వ్యవహారంలో శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య ఠాక్రేపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా ఆదేశించాలని, స్వతంత్ర దర్యాప్తు కోసం కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు.

బాంబే హైకోర్టులో దిశ సాలియన్ తండ్రి పిటిషన్
ముంబై, మార్చి 20: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. దిశ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె తండ్రి సతీశ్ సాలియన్ బాంబే హైకోర్టును ఆశ్రయించడం మహారాష్ట్రలో మరోసారి రాజకీయ దుమారం రేపింది. ఈ వ్యవహారంలో శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య ఠాక్రేపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా ఆదేశించాలని, స్వతంత్ర దర్యాప్తు కోసం కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారని, ఫోరెన్సిక్ ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల కథనాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆత్మహత్య లేదా ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా నిర్ధారిస్తూ ముంబై పోలీసులు హడావుడిగా దర్యాప్తును ముగించారని, పలుకుబడి ఉన్న వ్యక్తులను కాపాడేందుకు కేసును నీరుగార్చారని ఆరోపించారు. కాగా, దిశ మృతిచెందిన ఐదేళ్ల తర్వాత ఆమె తండ్రి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడాన్ని ఒక రాజకీయ ఎత్తుగడగా శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ అభివర్ణించారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..