1984 Anti-Sikh Riots: సిక్కుల ఊచకోత కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ
ABN , Publish Date - Feb 12 , 2025 | 03:43 PM
1984 నవంబర్ 1న సరస్వతి విహార్ ప్రాంతంలో తండ్రీకొడుకుల హత్య కేసులో సజ్జన్ కుమార్ ప్రమేయం ఉన్నట్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజ బుధవారంనాడు తీర్పునిచ్చారు. శిక్షపై వాదనలు వినేందుకు కేసును ఫిబ్రవరి 19వ తేదీకి వాయిదా వేశారు.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల (anti Sikh riots) కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ (Sajjan Kumar)ను రౌస్ అవెన్యూ కోర్టు దోషిగా తేల్చింది. 1984 నవంబర్ 1న సరస్వతి విహార్ ప్రాంతంలో తండ్రీకొడుకుల హత్య కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా బుధవారంనాడు తీర్పునిచ్చారు. శిక్షపై వాదనలు వినేందుకు కేసును ఫిబ్రవరి 19వ తేదీకి వాయిదా వేశారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లో జరిగిన మరో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ప్రస్తుతం సజ్జన్ కుమార్ యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు.
Supreme Court: ఎన్నికల్లో ఉచితాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
తీర్పు సందర్భంగా సజ్జన్ కుమార్‌ను తీహార్ జైలు నుంచి బుధవారంనాడు కోర్టు ముందు హాజరుపరిచారు. 1984 నవంబర్ 1న జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్ హత్య కేసులో కోర్టు ఆయనను దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.
1984లో ఏమి జరిగింది?
ప్రాసిక్యూషన్ వాదన ప్రకారం, మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యానంతరం ఒక పెద్ద గంపు మారణాయుధాలతో విరుచుకుపడింది. సిక్కులను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున లూటీలు, గృహదహనాలకు పాల్పడింది. అల్లరిమూక సింగ్, ఆయన కుమారుడిని హత్య చేసి ఇల్లు లూటీ చేసిందని, ఆ తర్వాత ఇంటికి నిప్పుపెట్టిందని ప్రాసిక్యూషన్ పేర్కొంది. సజ్జన్ కుమార్ కేవలం ఈ అల్లర్లలో పాల్పొనడమే కాకుండా ఆ గుంపునకు నాయకత్వం వహించాడని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు తగిన సాక్ష్యాలు లభించాయని తెలిపింది.
కాగా, సజ్జన్ కుమార్‌ను దోషిగా కోర్టు ప్రకటించడాన్ని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజిమెంట్ కమిటీ (డీఎస్‌జీఎంసీ) ప్రధాన కార్యదర్శి జగ్‌దీప్ సింగ్ కహ్లాన్ స్వాగతించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా సిట్‌ను ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మూసేసిన కేసులను తిరిగి ఇన్వెన్సిగేట్ చేయడం వల్ల ఈ ఫలితం వచ్చిందని, జగ్‌దీష్ టైట్టర్ల విషయంలోనూ న్యాయం జరుగుతుందని తాము ఆశిస్తున్నామని చెప్పారు. 1984 సిక్కు అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌ను దోషిగా నిర్దారిస్తూ 2018లో తీర్పు వెలువడింది. ఆయనకు యావజ్జీవ జైలుశిక్ష పడింది.
ఇవి కూడా చదవండి..
Kejriwal: పంజాబ్ సీఎంగా కేజ్రీవాల్?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.