Crime News: మ్యూజిక్ ఎక్కువగా పెట్టారని కంప్లైంట్.. చెప్పినవారిపై దాడి, హత్య..
ABN , Publish Date - Jan 19 , 2025 | 04:15 PM
ఓ యువతి పక్కింట్లో మ్యూజిక్ ఎక్కువగా పెట్టారని తగ్గించాలని కోరింది. కానీ ఆ యువకులు వినలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫోన్ చేసి తెలిపింది. దీంతో ఆవేశపడిన యువకులు యువతి ఇంటికి వచ్చి దాడి చేసి హత్య చేశారు.

రోజురోజుకు మనుషులు విచక్షణ లేకుండా, స్వార్థపూరితంగా ప్రవర్తిస్తున్నారు. పక్కింట్లో మ్యూజిక్ ఎక్కువగా (loud music) పెట్టారని ఓ 12వ తరగతి విద్యార్థిని తగ్గించమని చెబితే వారు తగ్గించలేదు. దీనికి తోడు ఆ యువకులు ఇంకా హాంగామా సృష్టించడంతో ఆ యువతి పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారి మ్యూజిక్ సిస్టమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ క్రమంలో ఆగ్రహం చెందిన ఆ యువకులు ఆ యువతి ఇంటికి వచ్చి దాడి చేశారు.
నిందితులు అరెస్ట్..
ఆ క్రమంలో యువతి కుటుంబంలోని 65 ఏళ్ల వ్యక్తిని కర్ర, పారతో దాడి చేసి హత్య చేశారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని చందేరి (chanderi ) పోలీస్ స్టేషన్ పరిధిలోని గోరకల గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. దీనిపై స్పందించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రతిరామ్ అహిర్వార్, ముఖేష్ అహిర్వార్ ని అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు ఆధారంగా ఈ ఘటన మ్యూజిక్ పై వచ్చిన వివాదం వల్ల జరిగిన హత్యగా నిర్ధారించబడింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించారు.
పోలీసుల హెచ్చరిక...
దీనిపై పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఈ హత్య ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. గ్రామస్తులు ఈ అంశంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన మిగతా వారికి కూడా ఒక హెచ్చరికగా ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు ఏదైనా పార్టీ లేదా ఫంక్షన్లు జరిగినప్పుడు ఇతరులను ఇబ్బంది పెట్టొద్దని పోలీసులు సూచించారు.
మ్యూజిక్ పెట్టుకున్నా కూడా సౌండ్ తక్కువగా ఉంచుకోవాలన్నారు. చిన్న చిన్న విషయాలకు కోపంతో దాడులు, హత్యలు చేయడం సరికాదన్నారు. ఇలా చేయడం వల్ల అనేక మంది జీవితాలు నాశనం అవుతాయని గుర్తు చేశారు. అంతేకాదు ఇలాంటి విషయాల పట్ల చుట్టుపక్కల ఉన్న కూడా స్పందించాలని కోరారు.
ఇవి కూడా చదవండి:
Jio: తక్కువ ధరకే జియో 72 రోజుల ప్లాన్.. BSNL, ఎయిర్‌టెల్‌లకు సవాల్..
Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..
Narayana Murthy: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తికి షాక్.. భారీగా తగ్గిన సంపద
SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి
Budget 2025: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఖాతాల్లోకి రూ.10 వేలు
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Read More Business News and Latest Telugu News