Share News

Chennai: తీరానికి కొట్టుకొచ్చిన వింత వస్తువు..

ABN , Publish Date - Mar 25 , 2025 | 01:06 PM

ఓ వింత వస్తువు ఒకటి సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. అయితే.. దీన్ని చూసిన జాలర్లు బెంబేలెత్తినోయారు. కోడిగుడ్డు ఆకారంలో పసుపు రంగు వస్తువు ఒకటి సముద్ర తీరానికి కొట్టుకు వచ్చింది.

Chennai: తీరానికి కొట్టుకొచ్చిన వింత వస్తువు..

- భీతిల్లిన జాలర్లు

చెన్నై: కడలూరు(Kadaluru) జిల్లా పుదుసత్తిరం సమీపం సామియార్‌పేట, వేలంగిరాయన్‌పేట మధ్యలో సముద్రతీరానికి సోమవారం సాయంత్రం కోడిగుడ్డు ఆకారంలో పసుపు రంగు వస్తువు కొట్టుకు వచ్చింది. ఆ వస్తువుపై మాల్దీవులు అని నల్లరంగుతో రాసి ఉంది. ఆ వస్తువును చూడగానే స్థానిక జాలర్లు భీతిల్లారు. వెంటనే మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సమాచారం తెలుసుకుని మత్స్యశాఖ అధికారులు, పుదుసత్తిరం పోలీసులు, కోస్ట్‌గార్డ్‌(Costguard) అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆ వస్తువును పరిశీలించారు.

ఈ వార్తను కూడా చదవండి: BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్‏పై కేసు నమోదు.. విషయం ఏంటంటే..


nani7.jpg

నీటిపై తేలియాడే ఆ వస్తువు సముద్రంలో సరిహద్దులను తెలియజేయడానికి ఉపయోగించేది అయి ఉంటుందని కోస్ట్‌గార్డ్‌ అధికారులు అనుమానిస్తున్నారు. అదే విధంగా నౌకలో తేలే బోయా అనే వస్తువు అయి ఉండవచ్చునని మత్స్యశాఖ అధికారులు భావిస్తున్నారు. అన్ని పరీక్షించిన తర్వాత అది పేలుడు వస్తువుకాదని నిర్ధారణ కావటంతో కోస్ట్‌గార్డ్‌ అధికారులు ఆ వస్తువును వ్యాన్‌లో తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

టీవీ నటిపై లైంగిక దాడికి యత్నం

ఎంఎంటీఎస్‌లో అత్యాచార యత్నం

న్యాయవాది దారుణ హత్య

పరీక్ష రాయనివ్వకపోతే చావే శరణ్యం

Read Latest Telangana News and National News

Updated Date - Mar 25 , 2025 | 01:06 PM