Share News

Mallikarjun Kharge: మణిపూర్‌లో తాజా అల్లర్లు.. బాధ్యత నుంచి మోదీ తప్పించుకోలేరన్న ఖర్గే

ABN , Publish Date - Jan 04 , 2025 | 04:25 PM

మణిపూర్ విషయంలో బీజేపీ స్వప్రయోజనాలు చూసుకుంటోందని పదేపదే తాము బాధ్యతాయుతంగా చెబుతూ ఉన్నామని ఖర్గే తెలిపారు. మణిపూర్ హింసాకాండలో 250 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 60,000 మంది నిరాశ్రయులయ్యారని అన్నారు.

Mallikarjun Kharge: మణిపూర్‌లో తాజా అల్లర్లు.. బాధ్యత నుంచి మోదీ తప్పించుకోలేరన్న ఖర్గే

న్యూఢిల్లీ: మణిపూర్ (Manipur) నిరంతరం హింసాత్మక ఘటనలతో రగులుతుండటం వెనుక బీజేపీకి స్వప్రయోజనాలు ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజధర్మాన్ని పాటించనందున రాజ్యాంగపరమైన తప్పిదం నుంచి ఆయన తప్పించుకోలేరని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు.

Jammu and Kashmir: ఆర్మీ వాహనం లోయలో పడి ఇద్దరు జవాన్లు మృతి


''సరిహద్దు రాష్ట్రం నిరంతరం రగులుతూ ఉండేలా చేయడంలో బీజేపీకి ఏవో స్వప్రయోజనాలు ఉన్నాయి. బీజేపీ మ్యాచ్‌స్టిక్‌తో మణిపూర్ రగులుతోంది'' అని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఖర్గే ఆరోపించారు. మణిపూర్‌లో తాజా హింసాత్మక ఘటనకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా ఆయన షేర్ చేశారు.


''నరేంద్ర మోదీ జీ.. మీరు చివరిసారిగా ఓట్లు అడిగేందుకు 2022 జనవరిలో మణిపూర్‌ వెళ్లారు. 2023 మేలో హింసాత్మక ఘటనలు మొదలయ్యాయి. 600 రోజుల గడిచిపోయాయి. రాష్ట్రంలో ఒక్కో గ్రామం తుడిచిపెట్టుకుపోతోందని శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా మీడియా కథనాల్లో వెల్లడవుతోంది. మీ అసమర్ధ ముఖ్యమంత్రి రాష్ట్రంలో హింసాకాండకు క్షమించమని అడుగుతుంటారు. మీరు రాష్ట్రానికి రాకపోవడాన్ని మాత్రం ఆయన దాటవేస్తుంటారు'' అని ఖర్గే అన్నారు.


మణిపూర్ విషయంలో బీజేపీ స్వప్రయోజనాలు చూసుకుంటోందని పదేపదే తాము బాధ్యతాయుతంగా చెబుతూ ఉన్నామని ఖర్గే తెలిపారు. మణిపూర్ హింసాకాండలో 250 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 60,000 మంది నిరాశ్రయులయ్యారని, 20 నెలలుగా వారు తాత్కాలిక శిబిరాల్లోనే జీవనం సాగిస్తున్నారని అన్నారు. మణిపూర్‌లో శాంతి, యథాపూర్వ పరిస్థితి నెలకొనేలా చూడటం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసినట్టు తెలిపారు.


''మణిపూర్‌లో ఇండియా కూటమి సైతం డిసెంబర్ 6న మీకు (ప్రధానికి) మూడు విజ్ఞప్తులు చేసింది. 2024 ముగిసేలోపు మణిపూర్‌ను సందర్శించాలని కోరాం. కానీ మీరు ఆపని చేయలేదు. అఖిల పక్ష నేతలతో ఢిల్లీలోని మీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేశాం. అది కూడా చేయలేదు. మణిపూర్ అంశాన్ని నేరుగా మీరే చూసుకోవాలని కోరాం. ఆ పని కూడా చేసినట్టు కనిపించడం లేదు. మా విజ్ఞప్తుల్లో ఒక్కటైనా పట్టించుకోకుంటే మీరు రాజధర్మా్న్ని పాటించనట్టే అవుతుంది. రాజ్యాంగ తప్పిదం నుంచి మీరు తప్పించుకోలేరు'' అని ఖర్గే ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.


మణిపూర్‌లో తాజా హింస

మణిపూర్‌లోని ఇంఫాల్ ఈస్ట్ జిల్లా కాంగ్పోక్పిలో శుక్రవారంనాడు కొందరు ఎస్పీ కార్యాలయంలో మూకమ్మడి దాడికి దిగారు. సైబల్ గ్రామం నుంచి కేంద్ర బలగాలను ఉపసంహరిచడంలో ఎస్పీ కార్యాలయం విఫలమైందని ఆరోపిస్తూ జరిపిన ఈ దాడిలో ఎస్పీ గాయపడ్డారు. భద్రతా బలగాలు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణలో ఇరువైపులా పలువురు గాయపడ్డారు. సైబల్ గ్రామంలోని మహిళలపై డిసెంబర్ 31న భద్రతా బలగాలు లాఠీచార్జి చేశారని కుకీ సంస్థలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొందరు ఎస్పీ కార్యాలయంపై శుక్రవారం రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.


ఇవి కూడా చదవండి..

Grameen Bharat Mahotsav 2025: రూరల్ ఇండియా మహోత్సవ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

BJP: ఖర్గే రాజీనామా చేసే వరకు పోరాటం..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 04 , 2025 | 04:25 PM