Share News

Ministers: మంత్రులకు దడ పుడుతుందోచ్... 31మంది పనితీరుపై ఏఐసీసీకి నివేదిక

ABN , Publish Date - Jan 14 , 2025 | 11:46 AM

రాష్ట్రంలో సిద్దరామయ్య(Siddaramaiah) నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు పూర్తి కావడం, మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం కొనసాగుతున్న తరుణంలోనే మంత్రుల పనితీరుపై ఏఐసీసీకి నివేదిక సమర్పించడంతో దడ పట్టుకుంది.

Ministers: మంత్రులకు దడ పుడుతుందోచ్... 31మంది పనితీరుపై ఏఐసీసీకి నివేదిక

బెంగళూరు: రాష్ట్రంలో సిద్దరామయ్య(Siddaramaiah) నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు పూర్తి కావడం, మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం కొనసాగుతున్న తరుణంలోనే మంత్రుల పనితీరుపై ఏఐసీసీకి నివేదిక సమర్పించడంతో దడ పట్టుకుంది. మరో నెలరోజుల్లో శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ వెంటనే బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈలోగానే విస్తరణ ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Speaker: సీటీ రవి వివాదంలో నా నిర్ణయమే అంతిమం..


ఇప్పటికే సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) మరోసారి కేబినెట్‌లోకి తీసుకుంటానని శాసనసభ ఉప ఎన్నికల వేళ రాజీనామా చేసిన నాగేంద్రకు బహిరంగంగా హామీ ఇచ్చారు. మరికొంతమంది ఆశావహులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా సాగుతున్న తరుణంలోనే మంత్రుల పనితీరుపై రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ రూపొందించిన నివేదికను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీప్ సింగ్‌ సుర్జేవాలా(In-charge Randeep Singh Surjewala)కు సోమవారం అప్పగించారు.


pandu2.2.jpg

కేపీసీసీ(KPCC)లో జరిగిన పార్టీ పదాధికారుల సభలో సీఎం, డీసీఎంలు సమర్పించారు. రాష్ట్ర కేబినెట్‌లో పదిమంది మంత్రులు క్రియాశీలకం మినహా మిగిలినవారు తమ శాఖలపై పట్టు సాధించలేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు సైతం మంత్రుల పనితీరును తప్పుపట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలోనే కీలకమైన నివేదిక ఏఐసీసీకి చేరడంతో మంత్రివర్గ విస్తరణ, లేదా పునఃవ్యవస్థీకరణ ఉంటుందా..? అనేది చర్చనీయాంశం అవుతోంది.


ఈవార్తను కూడా చదవండి: గాలిపటం ఎగురవేస్తూ విద్యుదాఘాతంతో బాలుడి మృతి

ఈవార్తను కూడా చదవండి: పండుగ నాడు... పోషక శోభ

ఈవార్తను కూడా చదవండి: MLC K Kavitha: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత

ఈవార్తను కూడా చదవండి: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 14 , 2025 | 11:46 AM