Chhava: ఛావాతో మత ఉద్రిక్తతలు.. నిషేధించండి
ABN , Publish Date - Mar 21 , 2025 | 04:43 AM
ఛావా సినిమా మత విద్వేషాలు పెంచేలా ఉందని, అందువల్ల ఆ సినిమాను నిషేధించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ఆలిండియా ముస్లిం జమాత్, దర్గా ఆలా హజ్రత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షాహబుద్దీన్ రజ్వీ కోరారు. నాగ్‌పూర్‌లో గొడవలకు ఈ సినిమానే కారణమని పేర్కొన్నారు.

కేంద్ర హోం మంత్రికి ముస్లిం మతగురువు లేఖ
బరేలీ/బహ్రెయిచ్/నాగ్‌పూర్, మార్చి 20: ఛావా సినిమా మత విద్వేషాలు పెంచేలా ఉందని, అందువల్ల ఆ సినిమాను నిషేధించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ఆలిండియా ముస్లిం జమాత్, దర్గా ఆలా హజ్రత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షాహబుద్దీన్ రజ్వీ కోరారు. నాగ్‌పూర్‌లో గొడవలకు ఈ సినిమానే కారణమని పేర్కొన్నారు. ఈ మేరకు అమిత్‌షాకు లేఖ రాశారు. ఆ సినిమా విడుదల అయినప్పటి నుంచి దేశంలోని పరిస్థితులు దిగజారిపోతున్నాయని అన్నారు. భారతీయ ముస్లింలు ఎవరూ ఔరంగజేబును ఆదర్శ నేతగా భావించరని, కేవలం ఓ పాలకుడిగా మాత్రమే చూస్తారని చెప్పారు. ఇదిలా ఉండగా, నాగ్‌పూర్ హింసలో ప్రధాన నిందితుడు, మైనారిటీ డెమొక్రాటిక్ పార్టీ సిటీ చీఫ్ ఫాహిం ఖాన్‌తో పాటు మరో ఐదుగురిపై పోలీసులు దేశద్రోహం, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం నేరాల కింద గురువారం కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..