Gabon: గబాన్‌లో చిక్కుకున్న కర్ణాటక నాటువైద్యులు
ABN , Publish Date - Mar 24 , 2025 | 02:23 AM
6నెలల క్రితం ఔషధ మొక్కల విక్రయానికి గబాన్ దేశ రాజధాని లెబ్రవిల్‌కు వెళ్లిన 21 మందిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. గబాన్‌లో రాజకీయ మార్పులు చోటు చేసుకున్న తర్వాత 2023లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం విదేశీయులందరూ దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.

బెంగళూరు, మార్చి 23(ఆంధ్రజ్యోతి): దావణగెరె జిల్లాలో సంచార జాతులకు చెందిన నాటు వైద్యులు మధ్య ఆఫ్రికా ప్రాంతం గబాన్ దేశంలో చిక్కుకున్నారు. 6నెలల క్రితం ఔషధ మొక్కల విక్రయానికి గబాన్ దేశ రాజధాని లెబ్రవిల్‌కు వెళ్లిన 21 మందిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. గబాన్‌లో రాజకీయ మార్పులు చోటు చేసుకున్న తర్వాత 2023లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం విదేశీయులందరూ దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. కాగా, ఈ నాటువైద్యులు వ్యాపారాల కోసం ఉపయోగిస్తున్న వీసాలు నకిలీవని గుర్తించి లెబ్రవిల్ పోలీసులు అరెస్టు చేశారు.