Share News

Meerut: మీద కూర్చొని.. గుండెల్లో మూడు సార్లు పొడిచేసింది..

ABN , Publish Date - Mar 22 , 2025 | 06:08 AM

భార్య ముస్కాన్‌ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్‌.. మార్చి 4న సౌరభ్‌ను చంపి 15 ముక్కలు చేసి వాటిని ఓ సిమెంట్‌ డ్రమ్ములో వేసి విహారయాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, పథకం ప్రకారం సౌరభ్‌ను మత్తులోకి పంపిన ముస్కాన్‌.. భర్త ఛాతీ మీద కూర్చోని..

Meerut: మీద కూర్చొని.. గుండెల్లో మూడు సార్లు పొడిచేసింది..

భయపెడుతున్న మర్చంట్‌ నేవీ అధికారి హత్య తీరు

మేరఠ్‌, మార్చి 21 : ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో జరిగిన మర్చంట్‌ నేవీ అధికారి సౌరభ్‌ రాజ్‌పుత్‌ హత్య విషయంలో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు బయటికొస్తున్నాయి. భార్య ముస్కాన్‌ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్‌.. మార్చి 4న సౌరభ్‌ను చంపి 15 ముక్కలు చేసి వాటిని ఓ సిమెంట్‌ డ్రమ్ములో వేసి విహారయాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, పథకం ప్రకారం సౌరభ్‌ను మత్తులోకి పంపిన ముస్కాన్‌.. భర్త ఛాతీ మీద కూర్చోని.. అతని గుండెల్లో మూడు సార్లు కత్తితో పొడిచేసింది. కత్తితో పొడిచేందుకు ముస్కాన్‌ తొలుత సంశయించగా.. ‘‘మనం కొత్త జీవితం మొదలుపెట్టాలంటే నువ్వు సౌరభ్‌ను చంపాల్సిందే’’ అంటూ సాహిల్‌ చెప్పిన మాటలకు ప్రభావితమై ఘాతుకానికి పాల్పడింది.


కత్తిని ఎలా పట్టుకోవాలి, ఎలా పొడవాలి అంటూ సాహిల్‌ చేసిన సూచనలను పాటిస్తూ కిరాతకానికి తెగబడింది. ఈమేరకు సౌరభ్‌ను హత్య చేసిన తీరును ముస్కాన్‌ పోలీసులకు వెల్లడించింది. సౌరభ్‌ మొండాన్ని బెడ్‌బాక్స్‌లో పెట్టి ముస్కాన్‌ ఆ రాత్రి అదే మంచంపై నిద్రించిందని, కాళ్లూచేతులను సాహిల్‌ తన ఇంటికి తీసుకెళ్లాడని, కానీ పథకం మార్చుకుని తర్వాతి రోజు వాటిని ఓ డ్రమ్ములో వేసి సిమెంట్‌ పోశారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇక, ఈ కేసులో మరో నిందితుడైన ముస్కాన్‌ ప్రియుడు సాహిల్‌ విచిత్రమైన స్వభావం కలిగిన వ్యక్తి అని, డ్రగ్స్‌ బానిసని పోలీసు విచారణలో తేలింది.


ఇవి కూడా చదవండి:

Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు

Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా

MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

Updated Date - Mar 22 , 2025 | 06:08 AM