Parliament Members: పార్లమెంట్ సభ్యుల వేతనాలు పెంపు
ABN , Publish Date - Mar 24 , 2025 | 04:22 PM
ప్రస్తుత పార్లమెంట్ సభ్యుల జీతాలతో పాటు మాజీ సభ్యుల పెన్షన్, అదనపు పెన్షన్ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.

పార్లమెంట్ సభ్యుల జీతాలు, డైలీ అలవెన్సెస్,పెన్షన్, అదనపు పెన్షన్‌లలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. వాటిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుల జీతం లక్ష రూపాయలుగా ఉంది. దాన్ని ఏకంగా లక్షా 24 వేలకు పెంచింది. డైలీ అలవెన్సెస్‌ను 2వేల నుంచి 2,500లకు పెంచింది. పెన్షన్ విషయానికి వస్తే.. మాజీ సభ్యులకు ప్రతీ నెల 25 వేల పెన్షన్ అందుతోంది. దాన్ని 25 వేలనుంచి 31 వేలకు పెంచింది. మాజీ సభ్యుల అదనపు పెన్షన్‌లోనూ మార్పులు చేసింది. దాన్ని 2 వేల నుంచి 2,500లకు పెంచింది. ఈ పెంపు ఏప్రిల్ 1, 2023నుంచి అప్లై అవుతుంది.
కొద్దిరోజుల క్రితమే కర్ణాటక ప్రభుత్వం.. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను పెంచింది. అది కూడా 100 శాతం జీతాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నెల జీతం లక్ష ఉంటే.. పెంచిన జీత ప్రకారం 2 లక్షలు అవుతుంది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అసెంబ్లీలో రచ్చకు దారి తీసింది. ప్రతి పక్షాలు దీన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. ప్రభుత్వంలోని వారు మాత్రం దీన్ని సమర్ధించుకుంటున్నారు. కర్ణాటక హోం మినిస్టర్ జి. పరమేశ్వర దీనిపై మాట్లాడుతూ.. ‘ సాధారణ ప్రజల ఖర్చులు పెరుగుతున్నట్లే.. ప్రజా ప్రతినిధుల ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. సాధారణ పౌరుడిలాగే.. ఓ ఎమ్మెల్యే కూడా ఇబ్బందిపడుతున్నాడు. ఎమ్మెల్యేలతో పాటు ఇతరులనుంచి కూడా ప్రతి పాదనలు వచ్చాయి. అందుకే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. అందరూ బతకాలి కదా..’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
Kunal Kamra Controversy: హాబిటాట్ క్లబ్ ఆక్రమణల తొలగింపు.. రంగంలోకి దిగిన బీఎంసీ
Uddhav Thackeray: ద్రోహి అనడం తప్పు కాదు... కునాల్‌ను సమర్ధించిన ఉద్థవ్ థాకరే
Viral Video: అనుకోని సంఘటన.. ఈమె చేసిన పనికి హ్యాట్సాఫ్ అనాల్సిందే..