Rajeev Chandrasekhar: బీజేపీ కేరళ శాఖ అధ్యక్షుడిగా రాజీవ్‌చంద్రశేఖర్
ABN , Publish Date - Mar 24 , 2025 | 02:36 AM
పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్ష పదవి ఎన్నికల్లో ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారని బీజేపీ వర్గాలు తెలిపాయి. సోమవారం జరిగే బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో పార్టీ కేంద్ర పరిశీలకుడు - కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అధికారికంగా రాజీవ్ చంద్రశేఖర్ ఎన్నిక విషయం ప్రకటిస్తారని ఆ వర్గాల కథనం.

తిరువనంతపురం, మార్చి 23: బీజేపీ కేరళశాఖ అధ్యక్షుడిగా కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (60) బాఽధ్యతలు స్వీకరించనున్నారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్ష పదవి ఎన్నికల్లో ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారని బీజేపీ వర్గాలు తెలిపాయి. సోమవారం జరిగే బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో పార్టీ కేంద్ర పరిశీలకుడు - కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అధికారికంగా రాజీవ్ చంద్రశేఖర్ ఎన్నిక విషయం ప్రకటిస్తారని ఆ వర్గాల కథనం. తిరువనంతపురంలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్రశాఖ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో ఆదివారం రాజీవ్ చంద్రశేఖర్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సుందరేశన్ ఐదేండ్ల పదవీ కాలం పూర్తి కావడంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక నిర్వహిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తిరువనంతపురం లోక్‌సభాస్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శశిథరూర్ చేతిలో రాజీవ్ చంద్రశేఖర్ 16,077 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.