Share News

Saif Ali Khan: ఆసుపత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్

ABN , Publish Date - Jan 21 , 2025 | 03:28 PM

Saif Ali Khan: దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. దీంతో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Saif Ali Khan: ఆసుపత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్
Saif Ali Khan

ముంబై, జనవరి 21: దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని లీలావతి ఆసుపత్రి నుంచి మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్.. ముంబైలోని తన ఇంటికి పయనమయ్యారు. అంతకు ముందు లీలావతి ఆసుపత్రిలోని ఫార్మాల్టీస్ కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. అయితే సైఫ్ కోలుకొనేందుకు కొంత సమయం పడుతోందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది.

కొన్ని రోజుల పాటు సైఫ్‌కు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. అలాగే ఆయనను పరామర్శించేందుకు ఎవరిని ఇంట్లోకి అనుమతించ వద్దని సైఫ్ కుటుంబ సభ్యులకు వైద్యులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఓ వేళ అలా పరామర్శల వల్ల.. సైఫ్‌కు ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశముందని ఆయన కుటుంబ సభ్యులకు వారి వివరించినట్లు సమాచారం.

జనవరి 16వ తేదీ తెల్లవారుజామున బాంద్రాలోని శరణ్ హోసింగ్ సొసైటిలోని సైఫ్ అలీ ఖాన్ నివాసంలోకి చోరీకి దుండగుడు చొరబడి.. యత్నించాడు. ఆ క్రమంలో అతడిని సైఫ్ ప్రతిఘటించేందుకు యత్నించారు. దీంతో ఇరువురి మధ్య చిన్న పాటి ఘర్షణ చోటు చేసుకొంది. దాంతో సైఫ్‌పై దుండగుడు కత్తితో దాడి చేశాడు.


ఈ దాడిలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ క్రమంలో బిగ్గరగా అరవడంతో.. దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ వెంటనే సైఫ్‌ను కుటుంబ సభ్యులు లీలావతి ఆసుపత్రికి తరలించగా.. అతడికి వైద్యులు పలు శస్త్ర చికిత్సలు నిర్వహించారు. అనంతరం ఐసీయూకి తరలించారు. సైఫ్‌కు ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు.


మరోవైపు.. ఈ దాడి చేసిన దుండగుడిని సైఫ్ అలీ ఖాన్‌ నివాసం వద్దనున్న సీసీ కెమెరాల ద్వారా గుర్తించి.. అతడి ఫొటో విడుదల చేశారు. అతడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా థానేలో దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు పేరు విజయ్ దాస్ అని.. బంగ్లాదేశ్ నివాసి అని.. అయితే మారు పేర్లతో సంచరిస్తాడని పోలీసులు తమ విచారణలో గుర్తించారు. అతడి అసలు పేరు.. షరిఫుల్ ఇస్లాం షెహజాదీ అని.. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అతడు అక్రమంగా ప్రవేశించాడని పోలీసులు వెల్లడించారు.


ఇంకోవైపు సైఫ్ అలీ ఖాన్ నివాసం వద్ద సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. దుండగుడి కత్తితో దాడి చేయడంతో.. సైఫ్‌కు పలు తీవ్ర గాయాలు అయిన సంగతి తెలిసిందే. దీంతో సైఫ్‌ను ఆటోలో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించిన విషయం విధితమే.

For National News And Telugu News

Updated Date - Jan 21 , 2025 | 03:34 PM