Anna Hazare: కేజ్రీవాల్‌పై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు.. ‘ఆప్’ అందుకే ఓడిందంటూ..
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:31 PM
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతోంది. మొత్తం 70 స్థానాలు ఉండగా.. మెజారిటీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అయితే ఈ క్రమంలో సమాజిక కార్యకర్త అన్నా హజారే.. ఆమ్ ఆద్మీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార దాహంతోనే మాజీ సీఎం కేజ్రీవాల్ ఓడిపోయారన్నారు.

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతోంది. మొత్తం 70 స్థానాలు ఉండగా.. మెజారిటీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అయితే ఈ క్రమంలో సమాజిక కార్యకర్త అన్నా హజారే.. ఆమ్ ఆద్మీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార దాహంతోనే మాజీ సీఎం కేజ్రీవాల్ ఓడిపోయారన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి.
ఢిల్లీ ఎన్నికల్లో (Delhi Elections) ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి ధన బలం, అధికార దాహమే కారణమని అన్నా హజారే (Anna Hazare) అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల్లో ఆరపణలు వస్తుంటాయని, అయితే ప్రజల ముందు వాటిని రుజువు చేసుకోవాలని సూచించారు. ఒక అభ్యర్థి ప్రవర్తన, ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలన్నారు.
జీవితం మొత్తం ఎలాంటి నిందలు లేకుండా ఉండడంతో పాటూ త్యాగాలు చేసేలా ఉండాలని తెలిపారు. ఇలాంటి లక్షణాలు అభ్యర్థులపై ఓటర్లకు నమ్మకం కలిగిస్తాయన్నారు. మాజీ సీఎం కేజ్రీవాల్‌కు తాను ఈ విషయాలన్నీ చెప్పానని, కానీ ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌తో కేజ్రీవాల్ అప్రతిష్ఠపాలయ్యారన్నారు. ఇలాంటి తప్పులు చేయడం వల్లే ఆ పార్టీని ప్రజలు ఓడించారని తన మనసులోని మాటను బయటపెట్టారు.
Delhi Elections: ఢిల్లీ బాద్‌షా ఎవరు.. బీజేపీ గెలిస్తే సీఎం లిస్టుల్లో ఉన్నది వీళ్లే..!