MGNREGA: ఉపాధి నిధుల విడుదలలో వివక్ష లేదు
ABN , Publish Date - Mar 26 , 2025 | 04:30 AM
ఉపాధి హామీ నిధుల పంపిణీలో కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికీ వివక్ష చూపడం లేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లోక్‌సభలో స్పష్టం చేశారు. తమిళనాడుకు రూ.10 వేల కోట్లు కేటాయించగా, ఎక్కువ జనాభా ఉన్న యూపీకి అదే స్థాయిలో నిధులు ఇవ్వడం లేదని వివరించారు.

యూపీ కంటే తమిళనాడుకే అధిక నిధులు: పెమ్మసాని
న్యూఢిల్లీ, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపడం లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. తమిళనాడుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.7,300 కోట్ల నిధులు వచ్చాయన్నారు. మంగళవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు ఉపాధి హామీ నిధుల విడుదలలో వివక్ష చూపుతున్నారని ప్రశ్నించగా కేంద్ర మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ‘‘తమిళనాడు జనాభా 7కోట్లు, యూపీ జనాభా 20 కోట్లకుపైగానే ఉంది. కానీ, ఉపాధి నిధుల్లో తమిళనాడుకే ఎక్కువగా ఇస్తున్నాం. తమిళనాడుకు రూ.10 వేల కోట్లు ఇస్తుండగా, యూపీకి రూ.10 వేల కోట్ల లోపే ఇస్తున్నాం’’ అని వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే
Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్
Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ