Donald Trump: భారత్‌తో వాణిజ్య ఒప్పందం కోసం ట్రంప్ సంప్రదింపులు
ABN , Publish Date - Apr 06 , 2025 | 02:14 AM
ఈ నెల 9 నుంచి అమల్లోకి రానున్న ప్రతీకార సుంకాల నేపథ్యంలో ట్రంప్ భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు వేగవంతం చేశారు. భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు జరుపుతోంది.

న్యూఢిల్లీ, వాషింగ్టన్, ఏప్రిల్5: ఈ నెల 9 నుంచి ప్రతీకార సుంకాలు పూర్తి స్థాయిలో అమల్లోకి రానున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు సంప్రదింపుల ప్రక్రియ వేగిరం చేశారు. భారత్‌తో పాటు ఇజ్రాయెల్, వియత్నాంతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ట్రంప్ ప్రతీకార సుంకాలపై చైనా, కెనడా తరహాలో దూకుడుగా స్పందించకుండా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. నిజానికి 10 రోజుల క్రితమే అమెరికా వాణిజ్యమంత్రి భారత్‌లో పర్యటించారు. రెండు దేశాలకు పరస్పర ప్రయోజనకరంగా ఉండేలా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందామన్న భారత ప్రతిపాదనపై లోతుగా చర్చించారు. ప్రతీకార సుంకాలపై అమెరికాతో సహా ప్రపంచ దేశాల్లో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో ట్రంప్.. భారత్, ఇజ్రాయెల్, వియత్నాంతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సంప్రదింపులు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ నెల 7న అమెరికా వెళ్లనున్నారు. ట్రంప్‌తో ప్రతీకార సుంకాల అంశంపై చర్చించనున్నారు. ఈ నెల రెండున ట్రంప్ ఇజ్రాయెల్‌పై 17ు, భారత్‌పై 26ు, వియత్నాంపై 46ు సుంకాలు విధించారు. శనివారం నుంచి పది శాతం సుంకాలు అమల్లోకి వచ్చాయి.
ఇవి కూడా చదవండి..
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్
NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి
PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..
For National News And Telugu News