ఇంటర్ ప్రాక్టికల్స్ ఇలా చేస్తే ఫుల్ మార్కులు
ABN , Publish Date - Jan 20 , 2025 | 05:14 AM
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య దాదాపు ఇరవై లక్షలకు దగ్గరగా ఉంటుంది. దీనిలో సగం అంటే పది లక్షల వరకు ఇంటర్ రెండో సంవత్సరంలో ఉంటారు...

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య దాదాపు ఇరవై లక్షలకు దగ్గరగా ఉంటుంది. దీనిలో సగం అంటే పది లక్షల వరకు ఇంటర్ రెండో సంవత్సరంలో ఉంటారు. ఇందులో అరవై, డెబ్బయి శాతం మంది ఎంపీసీ, బైపీసీ వారే.
జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన జేఈఈ, నీట్, బిట్‌శాట్‌లలో ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేకపోయినా, టీఎస్, ఏపీ ఎప్‌సెట్‌లలో ఎంపీసీ, బైపీసీ సబ్జెక్టులకు 25 శాతం మెయిటేజీ ఉంటుంది. దీని కారణంగా ఇంటర్‌లో ప్రాక్టికల్స్‌కి ప్రాధాన్యం పెరిగింది. ఎంపీసీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో 30 మార్కుల చొప్పున మొత్తం ప్రాక్టికల్స్‌కి 60 మార్కులు కేటాయించారు. బైపీసీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో 30 మార్కుల చొప్పున మొత్తం 120 మార్కులు కేటాయించడం జరిగింది.
జాతీయస్థాయి పోటీ పరీక్షలపై దృష్టిపెట్టిన కొన్ని కాలేజీలు విద్యార్థులకు ప్రాక్టికల్స్ సరిగ్గా చేయించకుండా కేవలం పరీక్షలకు ముందు తూతూ మం త్రంలాగే నడిపించి పంపుతున్నారనే వార్తలు రావడంతో ఇంటర్మీడియెట్ బోర్డు ఈ ల్యాబ్ పరీక్షలను కూడా సీరియ్‌సగా నిర్వహించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే సీసీటీవీల ఏర్పాటు, కచ్చితమైన అటెండెన్స్, ప్రశ్నపత్రం లీక్ కాకుండా జాగ్రత్తలతోపాటు, రికార్డు పుస్తకాలను సరిగ్గా వాల్యుయేట్ చేయించడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.
అయితే ల్యాబ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కేవలం మార్కుల కోసమే కాకుండా కొంత సబ్జెక్టు నాలెడ్జ్ పెంచుకుంటే జేఈఈ, నీట్ పరీక్షల్లో కూడా ఉపయోగపడుతుంది. విద్యార్థులు ఈ కింది అంశాలపై దృష్టిపెడితే ప్రాక్టికల్స్‌లో పూర్తి స్థాయి మార్కులు సాధించవచ్చు.
1. ప్రాక్టికల్ రికార్డ్ బుక్స్: సిలబ్‌సలో ఉన్న అన్ని ప్రయోగాలు, వాటి అబ్జర్వేషన్స్/ రిజల్ట్స్‌ను జాగ్రత్తగా రాయాలి. అయితే కొంతమంది విద్యార్థులు రికార్డ్సు ఇంకొకరితో రాయిస్తారు. దీనివల్ల సబ్జెక్టు నాలెడ్జ్ పెరగకపోవడంతో, పరీక్షలో ఎగ్జామినర్ అడిగే ప్రశ్నలకు మార్క్స్‌పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రికార్డులు సొంతంగా రాయడం ఉత్తమం.
2. ప్రయోగాల సూత్రాలు: ఎక్వి్‌పమెంట్స్ లేదా ఇన్‌స్ట్రుమెంట్స్‌తో ప్రాక్టికల్స్ చేస్తున్నప్పుడు ఆ ప్రయోగం వెనక ఉన్న ఫండమెంటల్స్‌ను, ఇన్‌స్ట్రుమెంట్స్‌ని, వాటి ఉపయోగాలను అర్థం చేసుకోవాలి. పక్కన ప్రయోగం చేస్తున్న విద్యార్థులను అనుకరించవద్దు.
3. గ్రాఫ్ డ్రాయింగ్: ఇది అతి ముఖ్యమైన అంశం. మీ ల్యాబ్ సిలబ్‌సలో గ్రాఫ్స్ ఉన్నట్లయితే రికార్డ్ బుక్స్‌లో వాటిని జాగ్రత్తగా పొందుపర్చడంతో పాటు ఎగ్జామ్‌లో గీయాల్సి వస్తే, దానికి సంబంధించిన డేటాని సరిగ్గా విశ్లేషించాలి.
4. డయాగ్రామ్స్: బోటనీ, జువాలజీ ప్రయోగాలకు అవసరమైన డయాగ్రామ్స్‌ని కచ్చితంగా గీయడం నేర్చుకోవాలి. అంతే కాకుండా వాటి లేబులింగ్ స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి.
5. సేఫ్టీ: మీ కాలేజీలో లాబ్స్ చేస్తున్నప్పుడు, పరీక్షలో కూడా కెమికల్స్, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఇన్‌స్ట్రుమెంట్స్‌ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే వెంటనే అక్కడ ఉన్న ఇన్‌స్ట్రక్టర్‌కి తెలపాలి.
6. మాల్‌ఫంక్షనింగ్: పరీక్షలో ఏదైనా కారణంగాఒక ఇన్‌స్ట్రుమెంట్ సరిగ్గా పనిచేయకపోతే వెం టనే ఎగ్జామినర్‌కి తెలిపి దానిని రిపేర్ చేయించుకోవడమో లేదా ఇన్‌స్ట్రుమెంట్ మార్చుకోవడమో చేయాలి.
7. నమూనా పరీక్షలు - ముఖ్యమైన ప్రశ్నలు: గత సంవత్సరాల ప్రశ్నలతో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ బుక్‌లెట్ తయారు చేసుకోవాలి. పరీక్షకు ముందు ఈ ప్రశ్నలను తప్పకుండా రివిజన్ చేసుకోవాలి.
8. వైవా - వాయిస్: పరీక్ష రోజు ఎగ్జామ్ హాల్‌లో మీ ప్రవర్తన సరిగ్గా ఉండాలి. పక్కన విద్యార్థిని కాపీ చేయడం లేదా మెజర్‌మెంట్స్‌ని కాపీ చేయకూడదు. వైవాలో అడిగే ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వాలి. ప్రశ్నలు ఎలా వస్తున్నాయనే విషయంలో మీ ముందు సెషన్ లో పరీక్షకు వెళ్లిన విద్యార్థుల నుంచి కొంత ఫీడ్‌బాక్ తీసుకోవచ్చు, ఎలాంటి తొందరపాటు లేకుండా, ఆత్మవిశ్వాసంతో పరీక్షకు హాజరైతే పూర్తి మార్కులు సాధించవచ్చు.
గుడ్‌లక్
డాక్టర్ పవన్‌కుమార్ కాసు, డైరెక్టర్
సంజీవని జూనియర్ కాలేజీ, హైదరాబాద్