TANA 2025 Conference: తానా మహాసభలకు ముఖ్య అతిథిగా రండి.. సీఎం రేవంత్ రెడ్డికి తానా నాయకుల ఆహ్వానం
ABN , Publish Date - Mar 24 , 2025 | 06:00 PM
త్వరలో జరగనున్న తానా మహాసభలకు హాజరు కావాల్సిందిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సంస్థ నాయకులు ఆహ్వానించారు. తానా చేపడుతున్న వివిధ సేవాకార్యక్రమాలను కూడా ముఖ్యమంత్రికి వివరించారు.

డిట్రాయిట్‌లోని నోవైలో జూలై 3 నుంచి 5వ తేదీ వరకు జరగనున్న తానా 24వ మహాసభలను పురస్కరించుకుని తానా నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ముఖ్య అతిథిగా మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వనించారు. ఈ సందర్భంగా వారు మహాసభలకు సంబంధించిన వివరాలను, విశేషాలను, కమ్యూనిటీకి తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలియజేశారు.
తానాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సీఎం.. ఈ మహాసభలకు వస్తానని తెలియజేశారు. తానా కాన్ఫరెన్స్ చైర్మన్ గంగాధర్ నాదెళ్ళ, మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి, తానా మహాసభల డైరెక్టర్ సునీల్ పాంట్ర, చందు గొర్రెపాటి, శశి దొప్పాలపూడి, కన్నా దావులూరు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
Also Read: తానా మహాసభలు.. సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
అంతకుమునుపు తానా నాయకులు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయడు, ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ తదితరులను తానా నాయకులు మహాసభలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను కూడా వివరించారు. ఇక మహాసభలకు సంబంధించి తానా సర్వ సభ్య కమిటీ ఇటీవలే సమావేశమై ఏర్పాట్ల గురించి చర్చించింది. 25 కమిటీలకు సంబంధించిన సుమారు 90 సభ్యులు పాల్గొని ఏర్పాట్ల పురోగతిపై చర్చించారు.
మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి