Viral: మిలిటరీ కత్తి చేతబూని స్టెప్పులేసిన అమెరికా అధ్యక్షుడు.. ట్రంప్ సంబరం చూసి సైనికాధికారులకు టెన్షన్!
ABN , Publish Date - Jan 21 , 2025 | 09:47 PM
సైనికదళాల గౌరవార్థం ఏర్పాటు చేసిన కమాండర్ ఇన్ చీఫ్ బాల్ కార్యక్రమంలో ట్రంప్ కత్తిపట్టి చిందేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ప్రమాణస్వీకారం అనంతరం మిలిటరీ దళాల గౌరవార్థం ఏర్పాటు చేసిన కమాండర్ ఇన్ చీఫ్ బాల్ (విందు) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ డ్యాన్స్ అక్కడున్న సైనికాధికారులకు ముచ్చెమటలు పట్టించిందట. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది (Viral).
Viral: ట్రంప్ ప్రమాణస్వీకారం.. జో బైడెన్ రియాక్షన్ వైరల్
సైనికుల సేవలను స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని త్రివిధ దళాలు ఏర్పాటు చేశాయి. ఇందులో ట్రంప్ అమెరికా సర్వసైన్యాధిపతి హోదాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు ట్రంప్‌కు ఓ పొడవాటి కత్తి చేతికి ఇచ్చి కేట్ కట్ చేయమన్నాడు. ఈ విందులో కేక్ కటింగ్ ఓ ఆనవాయితీగా వస్తోంది.
Viral: మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు.. వారానికి 70 పని గంటలపై ఇన్ఫీ నారాయణమూర్తి కీలక వ్యాఖ్య
అయితే, రెండోసారి అధికారం చేపట్టిన సంబరంలో ట్రంప్ కత్తి పట్టి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. కత్తిని అటూ ఇటూ ఊపుతూ హడావుడి చేశారు. ఆహుతులకు ఫ్లైయింగ్ కిస్‌లు ఇచ్చారు. అయితే, ట్రంప్ కత్తి విన్యాసాలు కూడా అధికారులు కొద్దిగా టెన్షన్ పడ్డాడు. దేశాధ్యక్షుడికి పొరపాటున ఏమైనా జరగొచ్చని టెన్షన్ పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ట్రంప్‌కు సైగ చేసినట్టు కూడా తెలిసింది. అలా కాసేపు ట్రంప్ తన సంబరాన్ని పంచుకుని కేక్ కటింగ్‌కు ఉపక్రమించారు. ఈ కార్యక్రమంలో ట్రంప్‌తో పాటు ఆయన సతీమణి మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో పాటు ఆయన సతీమణి ఉష కూడా పాల్గొన్నారు.
Viral: సోషల్ మీడియాలో ఎలాగైనా వైరల్ అవ్వాలని.. యువకుడి షాకింగ్ వీడియో వైరల్
ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ వలసలపై ఉక్కుపాదం మోపారు. అమెరికాలో జన్మించిన వారికి పౌరసత్వం ఇచ్చే విధానానికి స్వస్తి పలుకుతూ ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ నిర్ణయంతో భారతీయులు కూడా టెన్షన్ పడుతున్నారు. అమెరికాలో తమ పిల్లలు పుట్టినందుకు పౌరసత్వం వస్తుందనుకుంటున్న అనేక మంది విదేశీయులకు ట్రంప్ నిర్ణయం తీవ్ర షాక్‌కు గురి చేస్తోంది. దీంతో, అక్కడి వీసాదారుల్లో ఆందోన పెల్లుబుకుతోంది.
Viral: గంటకు 282 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైలుకు వేళాడుతూ ప్రయాణం! తృటిలో తప్పిన ప్రమాదం!