Share News

Shocking: పెళ్లి ఊరేగింపు.. గుర్రంపైనే అచేతనంగా మారిపోయిన వరుడు.. అసలేం జరిగిందంటే..

ABN , Publish Date - Feb 18 , 2025 | 09:35 PM

వధూవరులకు పెళ్లి అనేది మరపురాని జ్ఞాపకం. అలాంటి సంతోషకర సమయంలో విషాదం ఎదురైతే మాత్రం ఎవ్వరూ తట్టుకోలేరు. కుటుంబ సభ్యులే కాదు.. అందరూ బాధకు గురవుతారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో అలాంటి దుర్ఘటనే జరిగింది.

Shocking: పెళ్లి ఊరేగింపు.. గుర్రంపైనే అచేతనంగా మారిపోయిన వరుడు.. అసలేం జరిగిందంటే..
Groom collapses with heart attack on Horse

పెళ్లి (Wedding) అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ అత్యంత మధురుమైన ఘట్టం. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి చేసుకునే ఓ సంతోషకర వేడుక. ముఖ్యంగా వధూవరులకు అదో మరపురాని జ్ఞాపకం. అలాంటి సంతోషకర సమయంలో విషాదం ఎదురైతే మాత్రం ఎవ్వరూ తట్టుకోలేరు. కుటుంబ సభ్యులే కాదు.. అందరూ బాధకు గురవుతారు. తాజాగా మధ్యప్రదేశ్‌ (Madhyapradesh)లో అలాంటి దుర్ఘటనే జరిగింది. పెళ్లికి ఊరేగింపుగా గుర్రంపై వచ్చిన వరుడు (Groom) గుండెపోటు (Heart Attack)తో కుప్పకూలిపోయాడు.


మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ నగరంలో జరుగుతున్న ఓ వివాహానికి భారీ ఊరేగింపుతో వరుడు వచ్చాడు. పెళ్లి సందర్బంగా వరుడిని ఎంతో అందంగా ముస్తాబు చేసిన గుర్రంపై ఊరేగించారు. చుట్టాలు, స్నేహితులు, స్థానికులతో కలిసి వందలాది మంది ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. వరుడు కూడా చాలా సంతోషంగా గుర్రంపై ఎక్కి ఊరేగింపునకు బయలుదేరాడు. అయితే మార్గమధ్యంలో అనుకోని ఘటన జరిగింది. పెళ్లి ఊరేగింపులో ఉన్న వరుడికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దాంతో అతను గుర్రంపై నుంచి పడిపోయాడు. అక్కడికక్కడే ప్రాణం పోయింది.


వరుడికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. వరుడి మరణంతో పెళ్లి ఇళ్లు కాస్తా శోక సంద్రంలో మునిగిపోయాయి. ఇరు కుటుంబాల్లోనూ తీరని విషాదం అలుముకుంది. ఆ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 18 , 2025 | 09:35 PM