Harsh Goenka: రెండు నెలలు తేనె-నిమ్మకాయ నీరు తాగితే.. ఫలితం ఏంటో చెప్పిన హర్ష్ గోయెంకా..
ABN , Publish Date - Feb 12 , 2025 | 03:47 PM
బరువును తగ్గించుకోవడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వాకింగ్, జిమ్ వంటి శారీరక శ్రమతో పాటు డైటింగ్ కూడా చేస్తుంటారు. బరువు తగ్గడం కోసం ఎవరేం చెబితే అది చేస్తుంటారు. చాలా మంది ఉదయాన్నే నిమ్మకాయ నీటిలో తేనె కలుపుకుని తాగితే మంచిదని చెబుతుంటారు.

ఈ ప్రపంచంలో అత్యధిక మందిని వేధిస్తున్న సమస్య ఊబకాయం (Heavy Weight). అనారోగ్య కారణాల రీత్యా అధికంగా ఉన్న బరువును తగ్గించుకోవడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వాకింగ్, జిమ్ వంటి శారీరక శ్రమతో పాటు డైటింగ్ కూడా చేస్తుంటారు. బరువు తగ్గడం కోసం ఎవరేం చెబితే అది చేస్తుంటారు. చాలా మంది ఉదయాన్నే నిమ్మకాయ నీటిలో తేనె కలుపుకుని తాగితే మంచిదని చెబుతుంటారు (Lemon juice with honey). చాలా మంది ఆ చిట్కాను పాటిస్తుంటారు. అందరిలాగానే హర్ష్ గోయెంకా (Harsh Goenka) కూడా ఆ ప్రయత్నం చేశారట.
రెండు నెలల పాటు ఉదయాన్నే నిమ్మకాయ నీటిలో తేనె కలుపుకుని తాగారట. ఆ తర్వాత ఏం జరిగిందో ఆయన ట్వీట్ చేశారు. ``రెండు నెలల పాటు ప్రతి రోజు ఉదయాన్నే నిమ్మ కాయ నీటిలో తేనె కలుపుకుని తాగితే రెండు కేజీలు తగ్గుతావని నాకు ఒకరు చెప్పారు. నేను అలాగే చేశాను. రెండు నెలల తర్వాత చూసుకుంటే రెండు కేజీల నిమ్మకాలు, మూడు కేజీల తేనె తగ్గాయి`` అంటూ ఫన్నీగా ట్వీట్ చేశారు. ఈ ఫన్నీ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. హర్ష్ గోయెంకా ట్వీట్‌పై చాలా మంది తమ స్పందనలను తెలియజేస్తున్నారు.
నిమ్మకాయలోని విటమిన్-సి, యాంటీ-ఆక్సిడెంట్లను పుష్కలంగా కలిగి ఉండే తేనె ఉదయాన్నే మెటబాలిజమ్‌ను పెంచుతాయని, బరువును తగ్గిస్తాయని చాలా మంది నిపుణులు కూడా పేర్కొంటున్నారు. ఈ పానీయం ఉదయాన్నే పేగు కదలికలను మెరుగుపరిచి మలబద్ధకం నివారణకు కూడా అద్భుతమైన ఔషధంగా పని చేస్తుందని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Groom video: సోదరా.. పెళ్లి వద్దు.. సిగ్నల్‌ను అర్థం చేసుకో.. వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే..
Viral Video: ఓర్నీ.. పకోడీలకు ఇంత డిమాండా? ఎలా కొట్టుకుంటున్నారో చూడండి.. వీడియో వైరల్..
Elephant Video: జేసీబీని ఎత్తి పడేసిన ఏనుగు.. తర్వాతేం జరిగిందో చూడండి.. వీడియో వైరల్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..