Share News

Viral: తృణమూల్ ఎంపీకి పాడైపోయిన ఐస్‌క్రీమ్ డెలివరీ!

ABN , Publish Date - Jan 17 , 2025 | 08:08 PM

తనకు పాడైన ఐస్‌క్రీమ్‌ను డెలివరీ చేసిన స్విగ్గీపై తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన డబ్బును తక్షణం రిఫండ్ చేయాలని లేదా మరో ఐస్‌క్రీమ్ పంపించాలని అన్నారు. ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారడంతో స్విగ్గీ కూడా స్పందించింది.

Viral: తృణమూల్ ఎంపీకి పాడైపోయిన ఐస్‌క్రీమ్ డెలివరీ!

ఇంటర్నెట్ డెస్క్: క్విక్ కామర్స్ సంస్థల రాకతో నగర జీవితం ఎంత సౌకర్యవంతంగా మారినా తరచూ తలెత్తే సేవాలోపాలు బాగా చిరాకు కలిగిస్తుంటాయి. తృణమూల్ ఎంపీ మహువా మొత్రాకు తాజాగా ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో, ఆమె స్విగ్గీపై ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌‌లో కొనసాగుతోంది (Viral).

బుధవారం స్విగ్గీలో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసిన ఎంపీ మహువా మొయిత్రా పాడైన ఉత్పత్తి డెలివరీ కావడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘స్విగ్గీ.. ఇది చాలా విచారకరం. మీరు మెరుగవ్వాలి. ఖరీదైన మైనస్ థర్టీ స్టిక్స్ ఐస్‌క్రీమ్ ఆర్డరిస్తే పాడైన, తినగలిగే స్థితిలో లేదు. రిఫండ్ ఇవ్వండి..లేదా మరో ఐస్‌క్రీమ్‌ను పంపించండి’’ అని పోస్టు పెట్టారు.


Viral: కుంభమేళాలో మోనాలిసా.. చూపు తిప్పుకోలేని అందం అంటే ఇదే!

కాగా, ఈ పోస్టుపై స్విగ్గీ వెంటనే స్పందించింది. ఎంపీకి కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. ఆర్డర్ నెంబర్ ఇస్తే సమస్యను సత్వరం పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. కాగా, తన ఆర్డర్ స్క్రీన్ షాట్‌ను కూడా మహువా మొయిత్రా షేర్ చేశారు. రూ.1220 పెట్టి మొత్తం 10 ఐటమ్స్‌ను ఆర్డర్ చేసినట్టు పేర్కొన్నారు.

Viral: విమానాల్లో కొబ్బరిని అనుమతించరు.. ఎందుకంటే..


ఇదిలా ఉంటే మహువా పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. స్విగ్గీ కంటే ఇతర యాప్‌లు మెరుగ్గా ఉన్నాయని కొందరు చెప్పుకొచ్చారు. తమకూ ఇలాంటి అనుభవాలు అనేకం ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు. ఇతర యాప్‌లల్లో రిఫండ్‌లు, వేగంగా జరుగుతాయని కూడా అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ ట్రెండవుతోంది.

Viral: పసిబిడ్డతో విమాన ప్రయాణం! టేకాఫ్‌లో జాప్యం జరగడంతో..

Viral: అత్త త్వరగా చనిపోవాలంటూ నోటుపై రాసి.. గుడి హుండీలో వేసి..

Read Latest and Viral News

Updated Date - Jan 17 , 2025 | 08:10 PM