Leopard Viral Video: వామ్మో.. షేక్‌ల విందులోకి చొరబడిన చిరుతపులి.. బిర్యానీ వాసన చూసి మరీ.. చివరకు..
ABN , Publish Date - Feb 27 , 2025 | 12:48 PM
కొందరు షేక్‌లు నేలపై కూర్చుని మధ్యలో పెద్ద ప్లేటులో బిర్యానీని పెట్టుుకుని తింటుంటారు. ఆ ప్లేటులో పొట్టేలు మాంసంతో పాటూ చాలా గుడ్లు కూడా ఉంటాయి. అయితే ఇంతలో చిరుత పులి అక్కడికి రావడంతో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది..

పులులు, సింహాలకు మాంసం కనపడితే.. పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్షణాల వ్యవధిలో మాంసాన్ని నోట కరుచుకుని ఎత్తుకెళ్తుంటాయి. అయితే కొన్నిసార్లు ఇవి విచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ చిరుత పులి షేక్‌ల విందులోకి వెళ్లింది. పెద్ద ప్లేటులో ఉన్న బిర్యానీని వాసన చూసిన చిరుత.. చివరకు ఏం చేసిందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు షేక్‌లు కలిసి పెద్ద పార్టీ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు వివిధ రకాల బిర్యానీలను చేయించారు. ఈ క్రమంలో కొందరు షేక్‌లు నేలపై కూర్చుని మధ్యలో పెద్ద ప్లేటులో బిర్యానీని పెట్టుుకుని తింటుంటారు. ఆ ప్లేటులో పొట్టేలు మాంసంతో పాటూ చాలా గుడ్లు కూడా ఉంటాయి. అయితే ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది.
ఓ పెద్ద చిరుత పులి అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. దాన్ని చూసి పారిపోవాల్సిన షేక్‌లు కూడా అందుకు విరుద్ధంగా దాన్ని తమ స్నేహితుడిలా ఆహ్వానిస్తారు. వారి మధ్యలోకి వెళ్లిన చిరుత.. అక్కడ ప్లేటులో ఉన్న (leopard smelled biryani) బిర్యానీని వాసన చూస్తుంది. అయినా దానిలో తినాలనే ఆసక్తిమాత్రం రాదు. ‘‘ఏంటీ ఈ బిర్యానీ.. అస్సలు నచ్చలేదు.. పచ్చి మాంసం తింటేనే మజా’’.. అని అనుకున్నట్లుగా.. అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోతుంది. అక్కడ మాసం, గుడ్లు ఉన్నా కూడా చిరుత వాటిని తినేందుకు మాత్రం ఆసక్తి చూపించదు.
Poori Making Video: పూరీని ఇలా ఎప్పుడైనా చేశారా.. ఇతనెలా సింపుల్‌గా చేసేస్తున్నాడో చూడండి..
బిర్యానీ తింటున్న వారి మధ్య చాలా సేపు ఉన్నా కూడా ఒక్క ముక్క కూడా ముట్టుకోదు. వీడియో చూస్తుంటే.. ఆ చిరుతను వారు పెంచుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ చిరుత మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఈ చిరుతకు బిర్యానీ అంటే ఇష్టం లేనట్టుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లు, 8.6 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఈ చెప్పులను ఎత్తుకెళ్లాలంటే ఆలోచించాల్సిందే.. చెప్పుల దొంగలకు భలే షాక్ ఇచ్చాడుగా..
ఇవి కూడా చదవండి..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..