Share News

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ప్రాణం పోతున్నా ఆహారాన్ని వదలని కొండచిలువ.. చివరకు..

ABN , Publish Date - Jan 31 , 2025 | 03:42 PM

కొండచిలువ వేట అత్యంత భయకరంగా ఉంటుంది. కొండచిలువ ప్రాణాలు వదులుకోవడానికైనా సిద్ధంగా ఉంటుంది కానీ నోటికి దొరికిన ఆహారాన్ని మాత్రం వదలదు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూడడానికి అతి భయంకరంగా ఉంది.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ప్రాణం పోతున్నా ఆహారాన్ని వదలని కొండచిలువ.. చివరకు..
Python Hunting video

కొండచిలువ (Python) చూడడానికే అత్యంత భయకరంగా ఉంటుంది. ఆకలి వేసినపుడు దానికి ఏదైనా చిక్కితే అది ప్రాణాలు వదిలేసుకోవాల్సిందే. కొండచిలువ నోటిలోకి వెళ్లిపోవాల్సిందే. కొండచిలువ వేట అత్యంత భయకరంగా ఉంటుంది. కొండచిలువ ప్రాణాలు వదులుకోవడానికైనా సిద్ధంగా ఉంటుంది కానీ, నోటికి దొరికిన ఆహారాన్ని మాత్రం వదలదు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూడడానికి అతి భయంకరంగా ఉంది (Python Video).


pavan__pratap_353 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో (Viral Video)ను ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో చిత్రీకరించారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ కొండచిలువకు ఓ భారీ జంతువు ఆహారంగా దొరికింది. దానిని మింగడానికి ప్రయత్నించింది. అయితే అనుకోకుండా ఆ రెండు కాలువలో పడిపోయాయి. కాలువలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది. ఆ నీటి ప్రవహ వేగానికి కొండచిలువ ఎదురీదలేకపోయింది. నీటి అడుగున ఉక్కిరిబిక్కిర అయింది. అంత ప్రమాదంలో ఉన్నా సరే కొండచిలువ ఆ జంతువును వదల్లేదు.


చనిపోయిన ఆ జంతువును మింగడానికి ప్రయత్నించి ఊపిరి ఆడక ఆ కొండచిలువ చాలా సేపు నీటిలో గింజుకుంది. చివరకు ప్రాణాలు వదిలేసింది. కాలువలో ఈ కొండచిలువను చూసిన గ్రామస్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ ఘటనను తమ మొబైల్స్‌లో చిత్రీకరించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోటి మందికి పైగా వీక్షించారు. అలాగే ఆ కొండచిలువ గురించి అటవీ అధికారులకు సమాచారం అందడంతో వారు అక్కడకు చేరుకున్నారు. కాలువలో నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉండడంతో కొండచిలువ బతికే అవకాశం లేదని, నీటిలోనే ఊపిరాడక చనిపోయిందని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Optical Illusion: ఈ రంగు రంగుల రామచిలుకల మధ్య సీతాకోక చిలుక ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి..


Tooth sticks in Kumbh Mela: ప్రేయసి ఐడియా అదిరిందిగా.. కుంభమేళాలో వేప పుల్లలు.. వేలల్లో సంపాదన..


Viral Video: అంకుల్ చెప్పింది వినాలిగా ఆంటీ.. ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో చూడండి..


Optical Illusion: ఈ మనుషుల మధ్యన పిల్లిని కనిపెడితే.. మీ కళ్లు చాలా పవర్‌ఫుల్ అని నమ్మాల్సిందే..


Strange Job: ఓర్నీ.. ఇలా కూడా కోట్లు సంపాదించవచ్చా? ఈ వ్యక్తి జాబ్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 31 , 2025 | 03:42 PM