IPL 2025: ఇది మాస్ కొట్డుడు రా మామా.. టీ20ల్లో ఏకంగా 600 సిక్స్‌లు కొట్టిన పూరన్..
ABN , Publish Date - Mar 24 , 2025 | 08:43 PM
విశాఖపట్నంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ బ్యాటర్లు హార్డ్ హిట్టింగ్ చేస్తున్నారు. నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు.

విశాఖపట్నంలో జరుగుతున్న ఐపీఎల్ (IPL 2025) మ్యాచ్ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ బ్యాటర్లు హార్డ్ హిట్టింగ్ చేస్తున్నారు (LSG vs DC). ఓపెనర్ మిచెల్ మార్ష్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 72) మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ చేసి ముకేష్ కుమార్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఇక, ఐదెన్ మార్క్‌రమ్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ (Nicholas pooran) ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు.
నికోలస్ పూరన్ (27 బంతుల్లో 7 సిక్స్‌లు, 5 ఫోర్లతో 70) బలంగా బంతిని బాదడమే ధ్యేయంగా ఆడుతున్నాడు. తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 సిక్స్‌లు కొట్టాడు. ఈ నేపథ్యంలో టీ-20ల్లో 600 సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. వెస్టిండీస్ తరఫున ఆడే ఈ ట్రినిడాడ్ ఆటగాడు పవర్‌ఫుల్ హిట్టింగ్‌కు పెట్టింది పేరు. ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. దీంతో ప్రస్తుతం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టు 14 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.
ఇవి కూడా చదవండి..
MS Dhoni: ఐపీఎల్ బాగానే ఉంది.. మరింత మసాలా అవసరం లేదు: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ధోనీ స్పందన
Harbhajan Singh: నల్ల ట్యాక్సీ అంటూ ఆర్చర్‌పై వివాదస్పద వ్యాఖ్యలు.. హర్భజన్‌పై తీవ్ర ఆగ్రహం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..