Share News

Window XP Wallpaper: ప్రపంచంలో బాగా పాప్యులర్ అయిన ఈ విండోస్ వాల్‌పేపర్ చరిత్ర గురించి తెలిస్తే..

ABN , Publish Date - Mar 24 , 2025 | 03:32 PM

గడ్డి మైదానం.. బ్యాక్‌గ్రౌండ్‌లో వినీలాకాశం..అక్కడక్కడా మేఘాలు.. 2000ల నాటి ఈ విండోస్ వాల్ పేపర్ చరిత్ర ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. మరి నాటి ఆసక్తికర విషయాలు ఏంటో తెలుసుకుందాం పదండి

Window XP Wallpaper: ప్రపంచంలో బాగా పాప్యులర్ అయిన ఈ విండోస్ వాల్‌పేపర్ చరిత్ర గురించి తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఇప్పటి తరానికి విండోస్ అంటే 11 వర్షన్‌యే గుర్తుకు వస్తుంది. కానీ 90ల్లో పుట్టిన తరాని మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయే వర్షన్ విండోస్ ఎక్స్‌పీ. ముఖ్యంగా అందులోని వాల్‌పేపర్ మాత్రం రెండు మూడు తరాల వారి మనసులపై చెరగని ముద్ర వేసింది. గడ్డి మైదానం.. తెల్లని మబ్బులతో కూడిన వినీలాకాశాం.. అప్పట్లో ఏ డెస్క్ టాప్ కంప్యూటర్ స్క్రీన్ చూసినా ఇదే దృశ్యం కనిపించేది. కాలం గడిచేకొద్దీ కొత్త కొత్త విండోస్ వర్షన్లతో పాటు కొత్త సాంకేతికతలెన్నో ఉనికిలోకి వస్తుండటంతో నాటి గుర్తులు కూడా క్రమంగా మనసుపై నుంచి చెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో నాటి విండోస్ ఎక్స్‌పీ చరిత్రను గుర్తుకు చేస్తూ ఓ పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అప్పట్లో ఆ వాల్‌పేపర్ ఫోటో ఎక్కడ తీసింది? ప్రస్తుతం ఆ ప్రదేశం ఎలా ఉందో వెల్లడించిన ఈ పోస్టు ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.


Read Also: కరెన్సీ నోట్లను ధ్వంసం చేస్తే శిక్షలు ఇవే

వాస్తవానికి ఆ చిత్రాన్ని కాలిఫోర్నియాలోని సొనోమా కౌంటీలో తీశారట. ఛార్ల్స్ ఓ రియర్ అనే ఫొటోగ్రాఫర్‌కు 1996లో ఆ అందమైన దృశ్యం కంటపడటంతో కెమెరాతో క్లిక్ మనిపించాడు. అప్పటికి అతడి వయసు కేవలం 25 ఏళ్లు.

అయితే, తను తీసిన ఫొటోకు చార్ల్స్ డిజిటల్ రూపం ఇచ్చాడు. కోర్బిస్ అనే వెబ్‌సైట్‌లో ఈ చిత్రం డిజిటల్ కాపీని రిజిస్టర్ చేశాడు. ఇక కోర్బిస్‌ను నిర్వహిస్తున్న వ్యక్తి కూడా బిల్ గేట్సే. ఓ రోజు ఈ ఫొటో ఆయన కంటపడటంతో బిల్ చార్ల్స్‌కు పది సెంట్లు చెల్లించి దాన్ని సొంతం చేసుకున్నారు.


Read Also: డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఎలా

నాటి చరిత్ర @insidestory అకౌంట్‌ ద్వారా మరోసారి నెట్టింట చర్చకు వచ్చింది. అప్పట్లో వాన పడ్డాక గడ్డి బాగా పెరిగిన సమయంలో చార్ల్స్ ఆ ఫొటో తీశాడట. ప్రస్తుతం ఆ ఫొటో తీసిన ప్రదేశం మాత్రం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆ ప్రాంతమంతా చెట్లు, మొక్కలతో నిండిపోయింది. నాటి పచ్చిక మైదానం నిర్జీవమైన రంగుల్లో కనిపించడంతో జనాలు షాకైపోతున్నారు. దీంతో, ఈ పోస్టు పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Read Latest and Viral News

Updated Date - Mar 24 , 2025 | 03:44 PM