AP Government: వైద్యరంగంలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ABN , Publish Date - Mar 24 , 2025 | 08:55 PM
AP Government: వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తాత్కాలిక మెడికల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అమరావతి: బోధనాస్పత్రులకు చెందిన ప్రొఫెసర్లు, ప్రాక్టీసింగ్ వైద్యులతో ఏపీలో తాత్కాలిక మెడికల్ కౌన్సిల్‌ను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం తాత్కాలిక మెడికల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చట్టం 1986లోని సెక్షన్ 3 ప్రకారం తాత్కాలిక మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తుందని తెలిపింది.
ఏపీలో కొత్త మెడికల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసేంతవరకూ తాత్కాలిక మెడికల్ కౌన్సిల్ పనిచేస్తుందని ఉత్తర్వుల్లో తెలిపింది. తాత్కాలిక మెడికల్ కౌన్సిల్‌లో సభ్యులుగా పిన్నమనేని సిద్ధార్ధ , వైద్య కళాశాల పలమానాలజీ విభాగం ప్రొఫెసర్ గోగినేని సుజాత, ఒంగోలు ప్రభుత్వాస్పత్రి ప్రొఫెసర్ కె.వెంకట సుబ్బాయనాడులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ల నుంచి మరో నలుగురు వైద్యులను తాత్కాలిక మెడికల్ కౌన్సిల్‌లో నియమించింది.
ఏపీలో ఆయుష్ సేవలపై ప్రణాళికలు..
ఏపీలో ఆయుష్ సేవల విస్తృతికి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. భారీ స్థాయిలో ఉన్న ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. ఆయుష్ డిస్పెన్సిరీల్లో 50 శాతం డాక్టర్ల కొరత ఉందని చెప్పారు. దేశవిదేశాల్లో ఈ సేవల పట్ల ఆసక్తి పెరుగుతున్నా.. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఆఖరి మూడేళ్లలో గత జగన్ ప్రభుత్వం జాతీయ ఆయుష్ మిషన్ కింద చేసిన ఖర్చు శూన్యమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో చేసిన ఖర్చు రూ.41 కోట్లు అని వివరించారు.పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ప్రణాళికలు చేపట్టాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
TDP MP: విడదల రజినికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్
High Court Orders: బోరుగడ్డపై పోలీసుల పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు
Good News: ఏపీ ఉద్యోగులకు పండుగలాంటి వార్త
Read Latest AP News And Telugu News