Thief returns bike: పాపం.. ఈ దొంగ మంచోడే.. చోరీ చేసిన బైక్‌ను తిరిగి ఇచ్చేసి ఏం చేశాడంటే..
ABN , Publish Date - Feb 26 , 2025 | 06:11 PM
దొంగలందరూ ఒకేలా ఉండరు. కొందరు నిత్యం దొంగతనాలకు పాల్పడుతూనే సంపాదిస్తుంటారు. మరికొందరు అవసరం కోసం దొంగలా మారుతుంటారు. అలాంటి వారు తమ తప్పు తెలుసుకుని దానిని సరిదిద్దుకుంటారు. తాజాగా తమిళనాడులోని శివమొగ్గలో కూడా అలాంటి ఘటనే జరిగింది.

మన దేశంలో దొంగతనాలు (Theft) అనేవి ప్రతిరోజు ఏదో ఒక మూల జరుగుతూనే ఉంటాయి. రకరకాల వస్తువులు చోరీకి గురవుతూ ఉంటాయి. అయితే దొంగలందరూ (Thieves) ఒకేలా ఉండరు. కొందరు నిత్యం దొంగతనాలకు పాల్పడుతూనే సంపాదిస్తుంటారు. మరికొందరు అవసరం కోసం దొంగలా మారుతుంటారు. అలాంటి వారు తమ తప్పు తెలుసుకుని దానిని సరిదిద్దుకుంటారు. అలాంటి పలు ఘటనల గురించి గతంలో మనం చదివే ఉంటాం. తాజాగా తమిళనాడు (TamilNadu) లోని శివమొగ్గలో కూడా అలాంటి ఘటనే జరిగింది. అయితే ఆ దొంగ నష్టపరిహారం కూడా చెల్లించాడు.
శివమొగ్గ జిల్లాలో పళయ్యూర్ అనే గ్రామంలో వీరమణి అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతను రాత్రి పూట ఎప్పుడూ తన బైక్ (Bike)ను ఇంటి ముందు పార్క్ చేస్తుంటాడు. కొన్ని రోజుల క్రితం, ఎప్పటిలాగానే రాత్రి తన ఇంటి ముందు బైక్ పార్క్ చేసి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచేసరికి, ఆ బైక్ కనిపించకుండా పోయింది. షాక్ అయిన వీరమణి, అతని కుటుంబ సభ్యులు బైక్ కోసం అన్ని చోట్లా వెతికారు. అయితే ఎక్కడా ఆ బైక్ దొరకలేదు. దీంతో తన బైక్‌ను ఎవరో దొంగిలించారని నిర్ధారించుకుని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులకు కూడా ఆ బైక్ ఆచూకీ లభించలేదు. దీంతో వీరమణి తన బైక్ గురించి ఆశలు వదిలేసుకున్నాడు.
గత సోమవారం రాత్రి వీరమణి ఇంటి ముందు అతని బైక్ ప్రత్యక్షమైంది. బైక్‌తో పాటు ఓ లేఖ కూడా ఉంది. ``నాకు అత్యవసరి పరిస్థితి ఎదురైంది. అందుకే వీధిలో పార్క్ చేసి ఉన్న బైక్‌ను తీసుకెళ్లిపోయా. తర్వాత ఆలోచిస్తే నాకు తప్పు అనిపించింది. అందుకే 450 కిలోమీటర్లు వెనక్కి వచ్చి మీ బైక్ ఇచ్చేశా. మీకు రుణపడి ఉంటాను. బైక్ కవర్లో రూ.1500 పెట్టాను. నా గురించి తప్పుగా అనుకోకండి`` అని ఆ లేఖలో రాశాడు. వీరమణి సమాచారం మేరకు అతడి ఇంటికి చేరుకున్న పోలీసులు ఆ లేఖను చదివి ఆశ్చర్యపోయారు.
ఇవి కూడా చదవండి..
Train Viral Video: ఇదెక్కడి వింత రైలు.. రోడ్డు మీద నడస్తున్న ఈ విచిత్రాన్ని చూస్తే షాకవ్వాల్సిందే..
Bride Viral Video: పెళ్లిలో అందరి ముందు ఆ ప్రశ్న అడిగిన వధువు.. వరుడు చేతిలో జోడించి ఏం చెప్పాడంటే..
Wife and Husband: అక్కడక్కడ ఇలాంటి మంచి భార్యలు కూడా ఉంటారు.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు చూస్తే..
Snake Viral Video: వామ్మో.. ఇది మామూలు ఫైట్ కాదు.. పాముల పోరాటం ఇంత భయంకరంగా ఉంటుందా?
Optical Illusion: మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ పుస్తకాల మధ్య తాళం చెవిని 5 సెకెన్లలో కనుగొనండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..