Prank of Friends: ఏమి జోకు రా నాయనా.. ఫ్రెండ్స్‌కు దాదాపుగా గుండె పోటు తెప్పించావుగా
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:38 PM
స్విమ్మింగ్ పూల్‌లో కొందరు రిలాక్స్ అవుతుండగా వారి స్నేహితుడు చేసి తుంటరి పని తాలూకు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గుండె పోటు వచ్చేలా అతడిచ్చిన షాకు చూసి నెటిజన్లు బిత్తరపోతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: లైఫ్‌లో స్నేహానికి మించిన అందమైన బంధం మరొకటి లేదు. ఆ మాటకొస్తే ఫ్రెండ్స్ లేకపోతే లైఫే లేదు.. ప్రాణస్నేహితులున్న అనేక మంది తరచూ చెప్పే మాట ఇది. మనసులో ఎంత బాధ ఉన్నా ఫ్రెండ్స్‌తో ఒక్క మాట చెప్పుకుంటే తీరిపోతుందని చెప్పే వారు ఎందరో ఉన్నారు. అలాంటి స్నేహాన్ని కాపాడుకునేందుకు ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. ఇదంతా ఒకెత్తైతే ఫ్రెండ్స్ చేసే అల్లరి మరొక ఎత్తు. వయసుతో సంబంధం లేకుండా చిలిపి పనులతో తమ స్నేహితులకు చుక్కలు చూపిస్తుంటారు కొందరు. అయితే, ఈ అల్లరికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జనాలు మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు (Viral).
Worlds most Expensive Mango: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు.. కిలో రూ.3 లక్షలు
ఘటన ఎక్కడ జరిగిందీ తెలీదు కానీ నెట్టింట మాత్రం తెగ వైరల్ అవుతోంది. వీడియలో కనిపించిన దాని ప్రకారం, కొందరు స్నేహితులు స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతూ ఉంటారు. కూల్ డ్రింక్స్ గట్రా తాగుతూ ఎండవేళలో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, వారు మరీ అంత కులాసాగా ఎంజాయ్ చేయడం చూసి వారి మిత్రుడు తుంటరి పనికి దిగాడు. చప్పుడు చేయకుండా వారి వెనకవైపు నుంచి వచ్చి ఓ బొమ్మ బల్లిని స్మి్మింగ్ పూల్‌లో పెట్టాడు.
ఆ తరువాత మెల్లగా ఓ వ్యక్తి చేయి కొరికి పారిపోయాడు. దీంతో, ఆ తల పక్కకు తిప్పడంతో బల్లి కనబడింది. అంత పెద్ద బల్లి కనిపించడంతో అతడి గుండె ఆగినంతపనైంది. బల్లి తనను కరిచిందని భయపడిపోయాడు. అది నిజమైన బల్లో కాదో ఆలోచించకుండా ఒక్కసారిగా దూకి స్విమ్మింగ్ పూల్‌లోంచి దూకి బయటపడే ప్రయత్నం చేశాడు.
Iceberg Flips Over: భయానక దృశ్యం.. సముద్రంలో తేలుతున్న మంచు ఫలకంపై ఎక్కితే
అతడి కంగారు చూసి రెండో వ్యక్తి కూడా స్విమ్మింగ్ పూల్‌లోంచి దూకి బయటపడే ప్రయత్నం చేశాడు. తీవ్రంగా కంగారు పడ్డ వారిద్దరూ అసలేం జరిగిందీ క్షణకాలం పాటు కూడా ఆలోచించేకపోయారు. ఆ తరువాత కాసేపటికి జరిగింది తెలిసి గుర్తించి వారూ నవ్వుకున్నారు. ఇక వెనక నిలబడి ఇదంతా చూస్తున్న వారి స్నేహితుడు కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నాడు.
ఇక వీడియో చూసిన జనాలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ప్రాక్టికల్ జోకులతో గుండెపోటు పక్కా అని కొందరు అన్నారు. ఎవయసులోనైనా ఫ్రెండ్స్ మధ్య కనిపించే సరదా సన్నివేశాలే వేరని మరొకరు అన్నారు. ఇలా జనాలకు ఆకట్టుకుంటున్న ఈ వీడియో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.