Leopard Viral Video: ఇంట్లోకి వెళ్లి కుక్క మెడ పట్టుకున్న చిరుత.. తర్వాతేం జరిగిందో చూస్తే షాక్..
ABN , Publish Date - Feb 23 , 2025 | 05:31 PM
వన్య ప్రాణులు ఆవాసం కోసం, ఆహారం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జనావాసాల వైపు వచ్చి ఇబ్బందులు పడుతున్నాయి. లేదా మనుషులపై దాడికి దిగుతున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అభివృద్ధి పేరుతో అడవులో కొట్టెయ్యడం, అడవుల మధ్య నుంచి రోడ్లు వేయడం మొదలైన కారణాలతో వన్య ప్రాణులు (Wild Animals) ఆవాసం కోసం, ఆహారం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జనావాసాల వైపు వచ్చి ఇబ్బందులు పడుతున్నాయి. లేదా మనుషులపై దాడికి దిగుతున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో చిరుత (Leopard)కు ఓ పెంపుడు కుక్క (Dog) దీటైన జవాబిచ్చింది (Viral Video).
wildanimalearth98 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ కుక్క ఇంటి ఆవరణలో ఉల్లాసంగా ఉంది. ఆ సమయంలో ఓ చిరుత ఆ ఇంట్లోకి ప్రవేశించింది. ఆ కుక్కపై దాడి దిగింది. హఠాత్తుగా ఆ చిరుతను చూసిన కుక్క అరుస్తూ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించింది. ఆ చిరుతు నేరుగా ఆ కుక్క మెడ పట్టుకుని చంపడానికి ప్రయత్నించింది. ముందు కాస్త లొంగినట్టు కనిపించిన ఆ కుక్క ఆ తర్వాత తన ప్రతాపాన్ని చూపించింది. ఆ చిరుతకు లొంగకుండా ఎదురు తిరిగింది.
ఆ కుక్క ఎదురు తిరగడంతో చిరుత వెంటనే దానిని వదిలేసి అక్కడి నుంచి పారిపోయింది. ఆ ఘటన ఇంటి బయట అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 15 లక్షల మంది వీక్షించారు. దాదాపు 2 లక్షల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
Shocking: అర్ధరాత్రి గురక పెట్టి నిద్రపోతున్న వ్యక్తి.. హఠాత్తుగా భారీ శబ్దం.. లేచి చూస్తే షాక్..
Rooster: కోడి నా జీవితంలో ప్రశాంతత లేకుండా చేస్తోంది.. కేరళ వాసి ఫిర్యాదుపై అధికారులు ఏం చేశారంటే..
Viral Video: ఛీ.. ఛీ.. పేద వాడిని కూడా వదలరా? రైల్లో ఈ ప్రయాణికుల తీరు చూస్తే కోపం రాకమానదు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి