Viral Video: వీడు కన్న తండ్రా? కిరాతకుడా? మూడేళ్ల చిన్నారితో మంచులో ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నాడో చూడండి..
ABN , Publish Date - Jan 31 , 2025 | 04:27 PM
తాజాగా ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ 25 ఏళ్ల వ్యక్తి తన మూడు నెలల కొడుకుతో కనికరం లేకుండా వ్యవహరించాడు. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియా ద్వారా ప్రతిరోజు మన కళ్ల ముందుకు వందల సంఖ్యలో వీడియోలు వస్తుంటాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. కొన్ని వీడియోలు మాత్రం షాకింగ్‌గా ఉంటాయి. అలాంటి వీడియోలు చూస్తే చాలా కోపం వస్తుంటుంది. తాజాగా అటువంటి షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ 25 ఏళ్ల వ్యక్తి తన మూడు నెలల కొడుకుతో (Son) కనికరం లేకుండా వ్యవహరించాడు. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు (Viral Video).
వైరల్ అవుతున్న ఆ వీడియోను అమెరికా (USA)లో చిత్రీకరించారు. టెక్సాస్‌కు చెందిన ఓ వ్యక్తి ఇంటి బయట ఉన్న కారు పూర్తిగా మంచు (Snow)తో నిండిపోయింది. దాంతో ఆ వ్యక్తి తన మూడు నెలల చిన్నారిని కారు (Car) బానెట్‌పై ఉంచి మంచును తొలగిస్తున్నాడు. ఆ కుర్రాడిని వైపర్‌లా ఉపయోగిస్తూ మంచును తొలగిస్తున్నాడు. మైనస్ డిగ్రీల చలిలో మూడు నెలల చిన్నారిని బయటకు తీసుకురావడమే ప్రమాదం. అలాంటిది ఆ కుర్రాడిని ఉపయోగించి మంచు తొలగించడమంటే అది కర్కశత్వమే. వీడియో కోసం ఆ వ్యక్తి తన కొడుకు ప్రాణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఈ వీడియో టిక్‌టాక్‌లో వైరల్ అయిన వెంటనే, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ``ఈ వ్యక్తి పిచ్చివాడేమో. ఎవరైనా తమ బిడ్డకు ఇలా ఎలా చేయగలరు`` అంటూ కామెంట్లు చేశారు. చాలా మంది ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో స్థానిక పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోర్ట్ ఆర్థర్ పోలీసులు నిందితుడిపై విచారణ ప్రారంభించారు. వైరల్ వీడియో ఆధారంగా విచారణ కొనసాగుతోందని, త్వరలో తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ప్రాణం పోతున్నా ఆహారాన్ని వదలని కొండచిలువ.. చివరకు..
Optical Illusion: ఈ రంగు రంగుల రామచిలుకల మధ్య సీతాకోక చిలుక ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి..
Tooth sticks in Kumbh Mela: ప్రేయసి ఐడియా అదిరిందిగా.. కుంభమేళాలో వేప పుల్లలు.. వేలల్లో సంపాదన..
Viral Video: అంకుల్ చెప్పింది వినాలిగా ఆంటీ.. ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి